ETV Bharat / sports

1983 ప్రపంచకప్​ ఆటగాళ్ల జీతాలు ఎంతో తెలుసా?

author img

By

Published : Jul 26, 2020, 6:14 AM IST

1983 ఐసీసీ ప్రపంచకప్​ను టీమ్​ఇండియా సాధించి ఇటీవలే 37ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అప్పటి సారథి కపిల్ దేవ్​​ నేతృత్వంలోని ఆటగాళ్లకు, ప్రస్తుత ఆటగాళ్లకు జీతభత్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

1983 World Cup
కపిల్ దేవ్​​

1983 ఐసీసీ ప్రపంచకప్​లో భారత్ ఓటమి అంచు నుంచి తప్పించుకోవడమే కాదు.. చరిత్రను తిరగరాసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత​ క్రికెట్​ రూపురేఖలను మార్చింది అంటే అతిశయోక్తి కాదేమో. ఈ మెగాటోర్నీలో టీమ్​ఇండియాకు సారథ్యం వహించిన కపిల్ దేవ్ సేన జాతికి గర్వకారణంగా నిలిచింది. ఇటీవలే ఈ విజయానికి 37 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఆ టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లతో పాటు ప్రస్తుత ఆటగాళ్ల జీతభత్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

1983 World Cup
కపిల్​ సేన

అమ్మో ఇంత తక్కువా!

ఇప్పుడైతే మన క్రికెటర్లకు లక్షల, కోట్లలో జీతాలు ఉన్నాయనుకోండి. కానీ 1983 ప్రపంచకప్ విజేత అయిన కపిల్​ సారథ్యంలోని జట్టు ఆటగాళ్ల జీతాలు తెలిస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఫొటో(అప్పట్లో వన్డే క్రికెట్​ ఫార్మాట్లో చెల్లించే జీతం) నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని మీరూ చూసేయండి. ఇందులో కనీస వేతనం సారథితో సహా మిగతా ఆటగాళ్లకు రూ. 2100 గా ఉంది.

salaries
అప్పటి ఆటగాళ్ల జీతభత్యాలు

ప్రస్తుతం బీసీసీఐ ప్రపంచంలోనే ఖరీదైన బోర్డుల్లో ఒకటిగా నిలిచింది. మన ఆటగాళ్లకు కాంట్రాక్​ పద్ధతుల్లో గ్రేడ్స్​ వారిగా వారిని ఎంపిక చేసుకుంటుంది. అలాగే జీతాలు కూడా చెల్లిస్తోంది. ఏ, ఏ ప్లస్​, బీ, సీ వంటి గ్రేడ్​ ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఏ ప్లస్​(7), ఏ(5), బీ(3), సీ(1) కోట్లు చెల్లిస్తోంది.

ప్రస్తుతం ఏ ప్లస్​ జాబితాలో సారథి విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, జస్ప్రిత్​ బుమ్రా ఉన్నారు. వన్డే ఫార్మాట్​లో ప్రతి మ్యాచ్​కు​ ఒక్కో ఆటగాడికి ఆరు లక్షల రూపాయలు వేతనం కాగా టీ20కి ముడు లక్షలుగా ఉంది. టెస్టులకు అత్యధికంగా రూ. 15 లక్షలు చెల్లిస్తోంది.

దేశవాళీ క్రికెట్​లో ఆటగాళ్లకు బాగానే చెల్లిస్తున్నాయి రాష్ట్రాల బోర్డులు. నాలుగు రోజుల రంజీ ట్రోపీలో ఆటగాళ్లకు రోజుకు రు.35వేలు చొప్పున వేతనం ఉంటుంది. ఓ ఆట మొత్తానికి సగటున ఒక్కో ఆటగాడు రూ. 3లక్షల రూపాయలు తీసుకుంటాడు.

salaries
ప్రస్తుతం ఆటగాళ్ల జీతభత్యాలు

ఐపీఎల్​

ఇక ప్రస్తుత క్రికెట్​లో ఐపీఎల్​కు ఉన్న జనాదరణ ఇతర ఏ ఫార్మాట్​కు లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఆటగాళ్ల సామర్థ్యం ఆధారంగా వేలంపాటలో ఫ్రాంచైజీలు కోట్లు చెల్లించి మరి కొనుక్కుంటాయి.

1983 విశేషాలు

కపిల్ దేవ్ సారథ్యంలో వెస్టిండీస్​తో తలపడిన భారత క్రికెట్ జట్టుకు ఈ టోర్నీ పెద్ద సవాల్​లాంటిది. విండీస్​ జట్టు ఇప్పటితో పోలిస్తే అప్పట్లో మరింత బలంగా ఉండేది. బాహుబలి లాంటిది అనే పేరుండేది. అప్పట్లో వరుసగా ప్రపంచ కప్‌లు గెలుస్తోన్న జట్టు అది. ఈ టోర్నీ ఫైనల్లో కరీబియన్ జట్టుకు కేవలం 183 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది టీమ్​ఇండియా. దీంతో విండీస్ ఆడుతు పాడుతూ గెలుస్తుంది అనుకున్నారు.

కానీ క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంటారుగా.... ఈ మ్యాచ్‌లో కూడా సరిగ్గా అదే అద్భుతం జరిగింది. భారత బౌలర్లు విండీస్​ను 140 పరుగులకే ఆలౌట్ చేశారు. లార్ట్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇలా తొలి ప్రపంచ కప్‌ను అందుకుని ప్రపంచానికి తన సత్తా చాటింది.

1983 World Cup
కపిల్​ సేన

ఇది చూడండి 'వారితో నన్ను ఎందుకు పోలుస్తారో అర్థం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.