ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ గైర్హాజరీతో చివరి మూడు టెస్టులకు రహానె తాత్కాలక కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అనంతరం ఆ సిరీస్ను భారత్ 2-1 తేడాతో గెల్చుకుంది. దీంతో కెప్టెన్సీ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై కొందరు మాజీలు బహిరంగంగానే సూచనలు చేస్తున్నారు. ఫలితంగా స్పందించిన బీసీసీఐ.. కోహ్లీని మార్చే ఆలోచనలు తమకు లేవని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో కోహ్లీసేన ఓ ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఆ తర్వాత సారథిగా ఉన్న రహానె జట్టును విజయపథంలో నడిపించాడు. విరాట్ తిరిగి జట్టులోకి చేరనున్న నేపథ్యంలో ఓ మీడియా సంస్థ, కెప్టెన్సీ విషయమై రహానెను ప్రశ్నించింది. ఇలాంటి వాటి గురించి ఆలోచించట్లేదని, ఇంగ్లాండ్ సిరీస్పై మాత్రమే దృష్టి సారించానని అతడు బదులిచ్చాడు.
ఇదీ చదవండి: భారత్-ఇంగ్లాండ్ సిరీస్కు ప్రేక్షకులు.. కానీ!