ETV Bharat / sports

రెండు ఫార్మాట్ల కోసం టీమ్​ఇండియా ఒకేసారి కసరత్తు - ప్రాక్టీసు మొదలుపెట్టిన టీమ్​ఇండియా

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా ఆటగాళ్లకు పూర్తిస్థాయి నెట్​సెషన్​ను ప్రారంభించారు. పరిమిత ఓవర్లతో పాటు సుదీర్ఘ ఫార్మాట్​లోనూ తిరిగి పట్టు సాధించడానికి రెడ్​, వైట్​ బాల్స్​తో క్రికెటర్లు సాధన చేస్తున్నారు.

'Red and White': Indian cricketers undergo net session for both short and long formats
రెండు ఫార్మాట్ల కోసం టీమ్​ఇండియాకు ఒకేసారి ప్రాక్టీసు
author img

By

Published : Nov 15, 2020, 10:18 PM IST

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్​ఇండియా ఆటగాళ్లకు కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. దీంతో సిడ్నీ ఒలింపిక్​ పార్క్​లో ఆదివారం నుంచి టీమ్​ఇండియా ఆటగాళ్లు పూర్తిస్థాయి నెట్​సెషన్​ను ప్రారంభించారు. ఇందులో వైట్​-బాల్​తో పాటు రెడ్​-బాల్​కూ ఒకేసారి శిక్షణ కసరత్తు చేస్తున్నారు.

రెడ్​ బాల్​తోనూ సాధన

శిక్షణలో భాగంగా ఆటగాళ్లందరూ వ్యాయామాలు, రన్నింగ్​ వర్కౌట్లను చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్లతో పాటు టెస్టు జట్టూ కలిసి ఉన్నందున వైట్​ బాల్​తో పాటు రెడ్​ బాల్​తోనూ నెట్స్​లో ప్రాక్టీసు చేయిస్తున్నారు. బీసీసీఐ తాజాగా పంచుకున్న వీడియోలో కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, టెస్టు స్పెషలిస్ట్​ చెతేశ్వర్​ పుజారా ఎర్రబంతితో క్యాచ్​లు ప్రాక్టీసు చేస్తున్నారు. మరోవైపు టీమ్​ఇండియాకు తొలిసారి ఎంపికైన టి. నటరాజన్​ కూకాబుర్రా వైట్​-బాల్​తో నెట్స్​లో బౌలింగ్​ చేస్తున్నాడు. దాదాపు అన్ని ఫార్మాట్లలోని టాప్​-ఆర్డర్​ బ్యాట్స్​మెన్​కు బౌలింగ్​ చేశాడు.

టెస్టు టీమ్​ సన్నద్ధం

టెస్టు జట్టుకు చెందిన చెతేశ్వర్​ పుజారా, అంజిక్య రహానె, పృథ్వీషా, హనుమ విహారి, రిషబ్​ పంత్​, రవిచంద్రన్​ అశ్విన్​ వంటి వారికి రెడ్​-బాల్​తో ప్రాక్టీసు చేస్తుండగా.. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు టీమ్​లోనూ స్థానం కలిగిన ఆటగాళ్లు రెండు బంతులతో సాధన చేస్తున్నారు. మార్చి నుంచి చాలా మంది ఆటగాళ్లు ఎర్రబంతితో సాధన చేయకపోవడం వల్ల టెస్టు మ్యాచ్​ల కోసం ఇప్పటినుంచే నెట్స్​లో శ్రమిస్తున్నారు.

భారత్​, ఆస్ట్రేలియా మధ్య నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి. తన భార్య అనుష్క బిడ్డను జన్మనివ్వనున్న నేపథ్యంలో సారథి కోహ్లీ టెస్టు సిరీస్​లోని​ చివరి మూడు మ్యాచ్​లకు అందుబాటులో ఉండటం లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.