ETV Bharat / sports

'అందువల్లే డబ్ల్యూటీసీ​లో స్థానం కోల్పోయాం' - జస్టిన్​ లాంగర్

స్వీయ తప్పిదం కారణంగానే ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్​ అవకాశాలు చేజార్చుకున్నామని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. భారత్​తో జరిగిన రెండో టెస్టులో నిర్ణీత సమయం లోపు రెండు ఓవర్లు తక్కువగా వేశామని ఒప్పుకున్నాడు.

'Really slack': Langer on MCG over-rate fine costing Australia spot in WTC final
'స్లో ఓవర్​ రేట్​ వల్లే డబ్ల్యూటీసీ​లో స్థానం కోల్పోయాం'
author img

By

Published : Mar 9, 2021, 10:18 AM IST

మెల్​బోర్న్​ వేదికగా భారత్​తో జరిగిన రెండో టెస్టులో నిర్ణీత సమయంలో ఓవర్ల కోట పూర్తి చేయని విషయాన్ని ఒప్పుకొన్నాడు ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్​ లాంగర్. దీనికి తమ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు.

"స్లో ఓవర్​ రేట్​ వల్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ అవకాశాలు కోల్పోయాం. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా నాలుగు పాయింట్ల కోత పడింది. అలా జరిగి ఉండకపోతే.. పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో ఉండేది."

-జస్టిన్ లాంగర్​, ఆస్ట్రేలియా ప్రధాన కోచ్.

"ఆట ముగిశాక మేమీ విషయాన్ని గుర్తించాం. స్లో ఓవర్ రేట్​ అనేది ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​పై ప్రభావం చూపిస్తుందనుకున్నా. ఇదే విషయాన్ని ఆటగాళ్లతో చెప్పా. తర్వాత సిడ్నీ, బ్రిస్బేన్​ టెస్టుల్లో ఈ తప్పిదం పునరావృతం కావొద్దని సూచించా. కానీ, జరగాల్సిన నష్టం జరిగింది"​ అని లాంగర్​ పేర్కొన్నాడు.

"స్వీయ తప్పిదం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు చేజారడం.. చాలా నిరాశకు గురి చేసింది. కానీ, ఇలాంటి తప్పిదాలు మరోసారి జరగకుండా ఉండటానికి ఇదొక గుణపాఠం" అని లాంగర్​ తెలిపాడు.

ఇదీ చదవండి: అత్యధిక కాలం నెం.1గా 'జకో' ఆల్​టైం రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.