ETV Bharat / sports

'ప్రస్తుత క్రికెటర్లలో జడేజానే ఉత్తమ​ ఫీల్డర్​' - ఐపీఎల్​ న్యూస్​

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాపై ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్​ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్​లో జడేజా ఉత్తమ ఫీల్డర్​ అని కొనియాడాడు.

Ravindra Jadeja best fielder in the game currently: Smith
ప్రస్తుత క్రికెటర్లలో జడేజానే ఉత్తమ​ ఫీల్డర్​: స్టీవ్​ స్మిత్​
author img

By

Published : Jun 16, 2020, 5:36 AM IST

టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాపై ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్​ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్​లో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో జడేజా ఉత్తమ ఫీల్డర్ అని కితాబిచ్చాడు. అలాగే టీమ్​ఇండియా క్రికెటర్లలో కేఎల్​ రాహుల్​ బ్యాటింగ్ శైలి తనను ఆకట్టుకుందని వెల్లడించాడు. తాజాగా ఇన్​స్టా లైవ్​లో పాల్గొన్న స్మిత్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.

ప్రస్తుత ఆటగాళ్లలో ఉత్తమ ఫీల్డర్​ ఎవరని స్మిత్​ను అడిగినప్పుడు.. రవీంద్ర జడేజా అని సమాధానమిచ్చాడు. తనలో ఉన్న ప్రత్యేకమైన ఫీల్డింగ్​ వ్యూహాలతో గుర్తింపు పొందిన జడేజా అనేక మంది ఆటగాళ్ల ప్రశంసలతో పాటు గౌరవాన్ని పొందాడు. ధోనీ గురించి మరో నెటిజన్​ అడగ్గా.."లెజెండ్. మిస్టర్​ కూల్​" అని.. కోహ్లీ విషయానికొస్తే బ్యాటింగ్​ సామర్థ్యంలో ఉత్తమ ఆటగాడని కొనియాడాడు స్మిత్​.

ట్రోఫీ నెగ్గాలంటే కష్టం

ఐపీఎల్​ తనకు ఇష్టమైన టోర్నీ అని.. ఆ ట్రోఫీని నెగ్గలాంటే చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు స్టీవ్​ స్మిత్​. ఎందుకంటే ఇందులో ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లందరితో పోటీ పడాలని తెలిపాడు. ఈ టోర్నీలో రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు స్మిత్​. భారత్​పై ఈ ఏడాది చివర్లో జరగనున్న బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.

ఇదీ చూడండి... 'టీమ్​ఇండియా కోచ్​గా అలా ఎంపికయ్యా'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.