ఆస్ట్రేలియా పర్యటన కోసం యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గత మూడేళ్లుగా ముంబయి తరపున, ప్రసుత ఐపీఎల్ సీజన్లోనూ బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. ఓపికగా ఉంటూ, అవకాశం వచ్చే వరకు వేచి చూడాలని తెలిపాడు. టీమ్ఇండియాలో ప్రతిభ కలిగిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారని, వారిని తీసి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే దారి కనిపించలేదని తెలిపాడు.
"సూర్యకుమార్ లాగే మరో ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు ఎంపిక చేయలేకపోయాం. ప్రతిభావంతులైనా సరే అనుభవం ఉన్న వారితో పోలిస్తే జట్టులోకి రావడం కష్టమవుతుంది. యువకులందరికీ నా నుంచి ఓ సందేశం. ఓపిక పట్టండి. మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. అదే సమయంలో గందరగోళానికి గురికావద్దు. నిరాశకు బదులుగా సానుకూలంగా ఉండండి"
- రవిశాస్త్రి, టీమ్ఇండియా ప్రధానకోచ్
2018 ఐపీఎల్లో ముంబయి తరపున 512 పరుగులు చేశాడు సూర్యకుమార్. గతేడాది 424 పరుగులు, ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 374 పరుగులు చేశాడు ఈ బ్యాట్స్‌మన్.
ఇవీ చూడండి:
భారత జట్టు ఎంపికపై మాజీలు తలోమాట