అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్.. మరోసారి మాయ చేశాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్ ఆడుతున్న ఇతడు.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు. శుక్రవారం.. అడిలైడ్ స్ట్రైకర్స్-బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రన్నింగ్ క్యాచ్‌తో క్రిస్‌లిన్(26)ను పెవిలియన్‌కు పంపాడు. ఈ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
-
Rashid Khan can do anything! We repeat, Rashid Khan can do anything!! 🤯🤯#BBL09 #OrangeArmy @rashidkhan_19pic.twitter.com/SlihwBwXyb
— SunRisers Hyderabad (@SunRisers) January 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rashid Khan can do anything! We repeat, Rashid Khan can do anything!! 🤯🤯#BBL09 #OrangeArmy @rashidkhan_19pic.twitter.com/SlihwBwXyb
— SunRisers Hyderabad (@SunRisers) January 17, 2020Rashid Khan can do anything! We repeat, Rashid Khan can do anything!! 🤯🤯#BBL09 #OrangeArmy @rashidkhan_19pic.twitter.com/SlihwBwXyb
— SunRisers Hyderabad (@SunRisers) January 17, 2020
ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. బ్రిస్బేన్ నిర్దేశించిన 101 పరుగుల లక్ష్యాన్ని, 10.5 ఓవర్లలోనే ఛేదించింది. ప్రస్తుత బిగ్‌బాష్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో ఉన్నాడు రషీద్(15). ఇతడి కంటే ముందు డేనియర్ సామ్స్ 17, హేరిస్ రౌఫ్ 16 ఉన్నారు.