ETV Bharat / sports

మీరు మాకు గర్వకారణం.. ఇప్పుడు మా వంతు: రణ్​వీర్ - రణ్​వీర్ సింగ్ 83 సినిమా

భారత ప్రముఖ క్రికెటర్ కపిల్​దేవ్​ పుట్టినరోజు సందర్భంగా, హీరో రణ్​వీర్ సింగ్ శుభాకాంక్షలు చెప్పాడు. ఆయనతో '83' సెట్​లో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. అవి ప్రస్తుతం వైరల్​గా మారాయి.

కపిల్​దేవ్​తో వెండితెర కపిల్​కున్న అనుబంధం
దిగ్గజ క్రికెటర్ కపిల్​దేవ్​తో రణ్​వీర్ సింగ్
author img

By

Published : Jan 6, 2020, 4:32 PM IST

టీమిండియా కెప్టెన్​గా ఎవరు వచ్చినా కోరుకునేది ఒక్కటే. 1983లో కపిల్​దేవ్ చేసిన మ్యాజిక్​ను మరోసారి పునరావృతం చేయాలని. అప్పుడు అనామక జట్టుగా మెగాటోర్నీలో అడుగుపెట్టిన భారత్.. కపిల్​ సారథ్యంలో విశ్వవిజేతగా అవతరించింది. జట్టులో అందరిని సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా ముందుకు నడిపించాడు కపిల్. ఇప్పటికీ 'కపిల్ డెవిల్స్' కప్​ అందుకుంటున్న ఫొటో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అభిమానుల మదిలో ఆనాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ప్రతి క్రికెటర్, ప్రతి కెప్టెన్ అలాంటి రోజు కోసమే ఎదురుచూస్తాడు.

kapildev with ranveer
దిగ్గజ క్రికెటర్ కపిల్​దేవ్​తో రణ్​వీర్ సింగ్

ఇప్పుడు ఆ ఇంద్రజాలాన్ని కపిల్​ బయోపిక్ '83' ద్వారా వెండితెరపై చూపించనున్నారు. రణ్​వీర్ సింగ్ ఇందులో హీరోగా, అతడి భార్య రోమిగా దీపిక కనిపించనుంది. కబీర్ ఖాన్ దర్శకుడు. ఏప్రిల్​10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా కోసం ఎన్నోసార్లు కపిల్​ను కలిశాడు రణ్​వీర్. ఆయన హావభావాలు, ముఖ కవళికలు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, పరుగెత్తడం వంటివి నేర్చుకున్నారు. సోమవారం(జనవరి 6) కపిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రణ్​వీర్ శుభాకాంక్షలు చెప్పాడు. "మీరు మాకు గర్వకారణమని, ఇప్పుడు మా వంతు వచ్చింది" అని ఇన్​స్టాలో రాసుకొచ్చాడు. సెట్​లో ఆయనతో ఉన్న ఫొటోలను ఇన్​స్టాలో పంచుకున్నాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.