ETV Bharat / sports

భారత క్రికెటర్లకు కెప్టెన్​గా ఇమ్రాన్​ఖాన్​!

భారత్​, పాకిస్థాన్​ క్రికెటర్లను కలిపి ఓ జట్టును రూపొందించాడు పాక్​ మాజీ క్రికెటర్​ రమీజ్​ రాజా. భారత బ్యాట్స్​మెన్లు, పాక్​ బౌలర్లతో సరికొత్త టీమ్​ను తయారు చేశాడు. ఈ జట్టుకు ఇమ్రాన్​ ఖాన్​ను కెప్టెన్​గా ఎంపికచేశాడు.

Rameez Raja picks combined India-Pakistan ODI XI of all-time
భారత బ్యాట్స్​మెన్లకు కెప్టెన్​గా ఇమ్రాన్​ఖాన్​!
author img

By

Published : May 17, 2020, 10:28 AM IST

భారత్​, పాకిస్థాన్ క్రికెటర్లతో ఓ జట్టును తయారు చేసినట్లు తెలిపాడు పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ రమీజ్​ రాజా. ఈ కూర్పు సమకూర్చడంలో కష్టతరమైనా తన కుమారుడు చెప్పిన లాజిక్​ను ఉపయోగించి భారత్​, పాక్​ ఎలెవన్​ జట్టును రూపొందించినట్లు పేర్కొన్నాడు. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ సునీల్​ గావస్కర్​తో కలిసి ఫేస్​బుక్​ లైవ్​ సెషన్​లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

"నా కుమారుడితో బాగా చర్చించాను. అత్యుత్తమ ఆటగాళ్ల నుంచి ఉత్తమ జట్టును ఎంపిక చేయడం కష్టంగా అనిపించింది. కానీ, చివరికి అది సాధ్యమైంది. పాకిస్థాన్​ బౌలర్లు, భారత బ్యాట్స్​మెన్లతో కలిపితే ఓ అద్భుతమైన జట్టు తయారైంది".

-రమీజ్​ రాజా, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​

జట్టులో భారత దిగ్గజ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్​, సునీల్​ గావస్కర్​లను ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్లుగా తీసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా విరాట్​ కోహ్లీ, సచిన్​ తెందూల్కర్​, రాహుల్​ ద్రవిడ్​, ఎంఎస్ ధోనీ (వికెట్​ కీపర్​)లు ఉన్నారు. అయితే రమీజ్​ రాజా స్వతహాగా పాకిస్థాన్ క్రికెటర్​ అవ్వడం వల్ల ఆ జట్టుకు ప్రస్తుత పాకిస్థాన్​ ప్రధాని, మాజీ క్రికెటర్​ ఇమ్రాన్​ఖాన్​ను కెప్టెన్​గా ఎంపిక చేశాడు.

రమీజ్​ రాజా ఎంపిక చేసిన భారత్​, పాక్​ ఎలెవన్ జట్టు​

వీరేంద్ర సెహ్వాగ్​, సునీల్​ గావస్కర్​, విరాట్ కోహ్లీ, సచిన్ తెందూల్కర్​, రాహుల్​ ద్రవిడ్​, ఎంఎస్​ ధోనీ, ఇమ్రాన్​ ఖాన్​, వసీం అక్రమ్​, వఖార్​ యూనిస్​, అనిల్​ కుంబ్లే, సక్లయిన్​ ముస్తాక్​.

ఇదీ చూడండి.. స్టీవ్​ వా అత్యంత స్వార్థపరుడు: షేన్​ వార్న్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.