శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరకు కీలక పదవి కట్టబెట్టింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్. వచ్చే సీజన్ కోసం అతడిని జట్టుకు డైరెక్టర్‌గా ఆదివారం నియమించింది యాజమాన్యం. ప్రస్తుతం మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడిగా ఉన్నాడు సంగక్కర.
బాధ్యతల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ విధానం, వేలం ప్రణాళికలతో పాటు జట్టు వ్యూహాలను రచించనున్నాడు. ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి మెరుగుపరచడం సహా నాగ్‌పూర్‌లోని రాజస్థాన్ రాయల్స్ అకాడమీని అభివృద్ధి చేసే బాధ్యతను అతడి అప్పగించింది.
"ప్రపంచంలోనే ప్రముఖ క్రికెట్ పోటీలో ఫ్రాంఛైజీ వ్యూహాల పర్యవేక్షణ, జట్టు విజయానికి అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనలో పాలుపంచుకునే అవకాశమే నేను బాధ్యతలు స్వీకరించడానికి ప్రేరణ" అని సంగక్కర అన్నాడు.
శ్రీలంక తరఫున 28వేల పైగా పరుగులు చేశాడు సంగక్కర. టెస్టుల్లో గత 46ఏళ్లలో అతడిదే అత్యుత్తమ బ్యాటింగ్ సగటు. డైరెక్టర్‌గా సంగా ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.

"వికెట్‌కీపింగ్ దిగ్గజంతో కలిసి పనిచేయడం గొప్పగా ఉంది. అతడో అద్భుతమైన వికెట్‌కీపర్-బ్యాట్స్‌మెన్. ఎన్నో ఘనతలు సాధించాడు. మంచి విలవ, వ్యక్తిత్వం గలవాడు." అని శాంసన్ అన్నాడు.
ఇదీ చూడండి: ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!