ETV Bharat / sports

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​: మెరుగైన కోహ్లీ, రాహుల్​

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. బ్యాటింగ్​ జాబితాలో ఒకస్థానం మెరుగైన టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ ఆరో స్థానానికి చేరుకోగా.. భారత ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ రెండో స్థానానికి చేరుకున్నాడు.

Rahul retains second spot, Kohli climbs to 6th in ICC T20I rankings
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​: మెరుగైన కోహ్లీ, రాహుల్​
author img

By

Published : Mar 3, 2021, 6:41 PM IST

పురుషుల టీ20 ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసింది. బ్యాటింగ్​ జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీతో పాటు ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. 816 పాయింట్లతో రాహుల్​ రెండో స్థానానికి చేరుకోగా.. 697 పాయింట్లతో కోహ్లీ ఆరో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లాండ్​కు చెందిన డేవిడ్​ మలన్(915) అగ్రస్థానంలో నిలిచాడు.

బౌలింగ్ విభాగంలో​ మొదటి ఆరు స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. అఫ్ఘానిస్థాన్​ స్పిన్నర్​ రషీద్​ఖాన్​.. 736 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్​కు చెందిన మిచెల్ శాంట్నర్​.. 648 పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్​కు చెందిన క్రిస్​ జోర్డాన్​ పదోస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టాప్​-10లో ఒక్క భారత బౌలర్​ లేకపోవడం గమనార్హం.

ఆల్​రౌండర్ల ర్యాంకింగ్స్​ టాప్​-10లోనూ టీమ్ఇండియా ఆటగాళ్లెవరూ స్థానం సంపాదించలేదు. ఈ జాబితాలో అఫ్ఘానిస్థాన్ క్రికెటర్​ మహ్మద్​ నబీ.. 294 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఇదీ చూడండి: అవి పిచ్​లా లేక పంట పొలాలా?.. ఈటీవీ భారత్​తో కర్సన్ ఘర్వీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.