ETV Bharat / sports

'ఐపీఎల్‌ ఆదాయమే దేశవాళీ క్రికెట్‌కు ఆధారం' - ఐపీఎల్ వార్తలు

ఐపీఎల్‌ వల్ల వచ్చే ఆదాయమే భారత దేశవాళీ క్రికెట్‌కు ఆధారమని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ప్రతిభావంతులైన అమ్మాయిలు, అబ్బాయిలు వెలుగులోకి రావాలంటే దేశవాళీ టోర్నీలు అవసరమని తెలిపాడు.

ఐపీఎల్‌ ఆదాయమే దేశవాళీ క్రికెట్‌కు ఆధారం

author img

By

Published : Aug 2, 2020, 9:22 AM IST

ఐపీఎల్‌ వల్ల వచ్చే ఆదాయమే భారత దేశవాళీ క్రికెట్‌కు ఆధారమని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ప్రతిభావంతులైన అమ్మాయిలు, అబ్బాయిలు వెలుగులోకి రావాలంటే దేశవాళీ టోర్నీలు అవసరమని తెలిపాడు.

‘"ఐపీఎల్‌ లాంటి టోర్నీల ద్వారా ఎంతో ఆదాయం వస్తుంది. ఆటగాళ్లు లేదా బీసీసీఐ పొందే రాబడి గురించి అంతా చర్చిస్తారు. కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో ఆలోచించరు. అండర్‌-19, అండర్‌-16 లాంటి టోర్నీల నిర్వహణ కోసం ఆ ధనాన్ని రాష్ట్ర సంఘాలకు పంపిస్తారు. ఆ డబ్బు ఆటలోనే కొనసాగుతుంది. దేశవాళీ టోర్నీల ద్వారా ఆదాయం రాదనేది వాస్తవం. వాటి నిర్వహణకే ఎంతో ఖర్చు అవుతుంది. ప్రతిభావంతులైన అమ్మాయిలు, అబ్బాయిలను వెలుగులోకి తీసుకురావాలంటే ఆ టోర్నీలు నిర్వహించాల్సిందే. వాటికి డబ్బు ఎక్కడి నుంచో రావాల్సిందే. అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి చాలా డబ్బు కావాలి. ఐపీఎల్‌ ద్వారా వచ్చే ఆదాయం దేశంలో దేశవాళీ క్రికెట్‌కు ఆధారంగా నిలుస్తుంది"’ అని ఓ వెబినార్‌లో ద్రవిడ్‌ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.