దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డికాక్.. క్రికెట్ తాత్కాలికంగా విరామాన్ని తీసుకోనున్నాడు. మానసిక సమస్యల కారణంగా ఆటకు కొద్దిరోజులు దూరంగా ఉంటాడని సఫారీ క్రికెట్ బోర్డు సీఈఓ ఆండ్రూ బ్రీట్జ్కే వెల్లడించాడు.
"మానసిక ఒత్తిడి కారణంగా క్వింటన్ డికాక్ కొన్ని వారాల విరామాన్ని తీసుకోనున్నాడు. ఈ విషయంలో సౌతాఫ్రికా క్రికెట్ అసోసియేషన్‌తో పాటు క్రికెట్ దక్షిణాఫ్రికా నుంచి అతడికి పూర్తి మద్దతు ఉంటుంది".
- ఆండ్రూ బ్రీట్జ్కే, క్రికెట్ దక్షిణాఫ్రికా సీఈఓ
దక్షిణాఫ్రికా వేదికగా పాకిస్థాన్‌తో ఏప్రిల్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు డికాక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా ఎంపికైన డికాక్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఆసియా దేశాలపై జరిగిన సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శనపై కెప్టెన్ డికాక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇదీ చూడండి: కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది: మ్యాక్స్‌వెల్