ETV Bharat / sports

సఫారీ యువ క్రికెటర్లకు అరుదైన గౌరవం - Quinton de kock honours at CSA Awards

దక్షిణాఫ్రికా క్రికెట్​ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో డి కాక్​, వోల్వార్ట్​​లకు అరుదైన గౌరవం దక్కింది. వరుసగా మెన్, ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​గా అవార్డులు దక్కించుకున్నారు.

win tQuinton de Kock, Laura Wolvaardtop honours at CSA Awards
దక్షిణాప్రికా యువ క్రికెటర్లకు అవార్డుల పంట
author img

By

Published : Jul 5, 2020, 2:54 PM IST

దక్షిణాఫ్రికా క్రికెట్​(సీఎస్​ఏ) వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో పరిమిత ఓవర్ల కెప్టెన్​ క్వింటన్​ డికాక్​.. 'మెన్ క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్'​గా ఎంపికయ్యాడు. ఇలా నిలవడం ఇతడికిది రెండోసారి. 2017లో ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. కరోనా ప్రభావంతో వర్చువల్​ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 27 ఏళ్ల డికాక్..​ 'టెస్టు క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్'​గానూ నిలిచాడు.

win tQuinton de Kock, Laura Wolvaardtop honours at CSA Awards
డి కాక్​

సఫారీ మహిళా​ యువ ఓపెనర్​ లారా వోల్వార్ట్​.. ఈ ఏడాది 'ఉమెన్​ క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్'​ సహా 'వన్డే క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించింది.​

లారా

పేసర్​ లుంగి ఎంగిడి.. 'వన్డే, టీ20 ప్లేయర్ ఆఫ్ ​ది ఇయర్'​గా.. డేవిడ్​ మిల్లర్​ 'అభిమానుల ఫేవరెట్​ ఆటగాడిగా' ఎంపికయ్యారు. ఫాస్ట్​ బౌలర్​ అన్రిక్​ నార్ట్​జె.. అంతర్జాతీయ​ 'మెన్స్​ న్యూ కమర్​ ఆఫ్​ ది ఇయర్'​గా పురస్కారం దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి:పోలీసుల అదుపులో శ్రీలంక క్రికెటర్​ మెండిస్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.