ETV Bharat / sports

'ఐపీఎల్​ను జరిపితే అందరూ ప్రశ్నిస్తారు'

టీ20 ప్రపంచకప్​ వాయిదా పడి, అదే విండోలో ఐపీఎల్​ను జరిపితే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ అభిప్రాయపడ్డాడు. ప్రైవేట్ లీగ్​లకు ఐసీసీ, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని సూచించాడు.

'ప్రపంచకప్​ బదులు ఐపీఎల్ జరిగితే ప్రశ్నిస్తారు'
ఐపీఎల్ 2020
author img

By

Published : Jul 6, 2020, 2:38 PM IST

కరోనా ప్రభావంతో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ వాయిదా పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఐపీఎల్​ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు.

"టీ20 ప్రపంచకప్​ జరిగే సమయంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్, భారత్-ఆస్ట్రేలియా సిరీస్ నిర్వహించనున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచకప్​ జరపడం కష్టమవుతుంది. బలమైన భారత క్రికెట్ బోర్డు, ఐసీసీని నియంత్రించాలని చూస్తోంది. మరోవైపు కరోనా వల్ల టీ20 ప్రపంచకప్​ జరపలేమని ఆస్ట్రేలియా అంటోంది. ఒకవేళ ఇదే జరిగి, ఐపీఎల్​ నిర్వహిస్తే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి​" -ఇంజమామ్ ఉల్ హక్, పాక్ మాజీ కెప్టెన్, సెలక్టర్

Inzamam
పాక్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్

షెడ్యూల్​ ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 మధ్య టీ20 ప్రపంచకప్​ ఆస్ట్రేలియాలో జరగాలి. ప్రస్తుతం కరోనా కోరలు చాస్తుండటం వల్ల 16 జట్లను ఒక్కచోటకు తెచ్చి, మ్యాచ్​లు నిర్వహించలేమని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే చెప్పేసింది. అయినప్పటికీ ఈ విషయమై ఎలాంటి నిర్ణయాన్ని ఐసీసీ తీసుకోలేదు.

T20 WORLD CUP
టీ20 ప్రపంచకప్ 2020

అయితే ఐసీసీ, ప్రైవేట్ లీగ్​లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకూడదని అన్నాడు ఇంజమామ్. ఇదే జరిగితే యువక్రికెటర్లు.. అంతర్జాతీయ టోర్నీల కంటే వాటి వైపే మొగ్గుచూపుతారని చెప్పాడు.

ఈ ఏడాది జరగాల్సిన ఆసియాకప్​ విషయంలో ఇంకా సందిగ్ధత అలానే ఉంది. పాక్​ ఆతిథ్యమిస్తే భారత జట్టు రానని చెప్పిన నేపథ్యంలో తటస్థ వేదికలో మ్యాచ్​లు నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.