ఒకే ఓవర్లో ఆరు సిక్సులు అనగానే మనకు గుర్తొచ్చే పేర్లలో ఒకటి టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు యువీ. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఈ రికార్డు సృష్టించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత, తాను ఉపయోగించిన బ్యాట్ గురించి చాలా మంది తనను అడిగారని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"సెమీస్‌లో ఆసీస్‌పై గెలిచిన తర్వాత ఆ జట్టు కోచ్ నా దగ్గరకు వచ్చి, న్యాయ బద్ధంగానే బ్యాట్ తయారు చేశారా? అని ఆడిగాడు. మ్యాచ్ రిఫరీ.. నా బ్యాట్‌ను పరీక్షించాడు. నీ బ్యాట్ ఎలా తయారు చేస్తున్నారు అని గిల్‌క్రిస్ట్ అడిగాడు. నిజం చెప్పాలంటే ఆ టోర్నీలో ఆడిన బ్యాట్ నాకెంతో ప్రత్యేకం. ఇంతవరకు అలాంటి దానితో ఆడలేదు" -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్
28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు యువీ. అయితే ఈ టోర్నీలోని తన సెలక్షన్ గురించిన విషయాల్ని వెల్లడించాడు యువరాజ్.
"ఒక్కో కెప్టెన్ ఒక్కో క్రికెటర్‌ను సపోర్ట్ చేస్తారు. ఈ విషయంలో ధోనీ ఎక్కువగా రైనాకు అవకాశాలిచ్చేవాడు. 2011 ప్రపంచకప్‌లో రైనాతో పాటు యూసఫ్ పఠాన్, నేను బాగా ఆడేవాళ్లం. అయితే లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం జట్టుకు ఉండటం వల్ల మేనేజ్మెంట్కు నేను తప్పు మరో మార్గం కనిపించలేదు" -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్
ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.. తనకిష్టమైన సారథి అని చెప్పాడు యువరాజ్. ఆట విషయంలో తనను దాదా ఎక్కువగా సపోర్ట్ చేసేవాడు అని తెలిపాడు యువీ.