ETV Bharat / sports

టీమ్​ఇండియాలో 'ఇద్దరు మిత్రులు' కథ! - Team india news

స్టార్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్​ శర్మ మధ్య అంతరాలు తొలగిపోయావని ప్రస్తుతం వారిద్దరూ మంచి మిత్రులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

Virat Kohli and Rohit Sharma
రోహిత్ శర్మ కోహ్లీ
author img

By

Published : Mar 31, 2021, 7:37 AM IST

"రోహిత్ ఫిటినెస్​పై సమాచారం లేదు. అతను ఆస్ట్రేలియాకు రాకుండా భారత్​కు ఎందుకు వెళ్లాడో తెలియదు".. ఆస్ట్రేలియా పర్యటన ముంగిట విరాట్ కోహ్లీ వ్యాఖ్యలివి. తన సహచరుడు, పైగా వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్ కెప్టెన్ అయిన రోహిత్ గురించి విరాట్ ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2019 ప్రపంచకప్ నుంచి వీళ్లిద్దరి మధ్య విభేదాల గురించి తరచుగా చర్చ నడుస్తుండగా.. ఆస్ట్రేలియాలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఈ సందేహాలకు మరింత బలం చేకూ ర్చాయి. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్ ఆరంభంలోనూ వీళ్లిద్దరి మధ్య అంతగా సయోధ్య కనిపించలేదు. కానీ ఆ జట్టుతో వన్డే సిరీస్ చివరికొచ్చేసరికి ఇద్దరూ గతంలో పోలిస్తే ఎంతో సన్నిహితంగా మెలగడం, మంచి మిత్రుల్లా వ్యవహరించడం అభిమానులను కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా బయో బబుల్ మహిమ అంటున్నాయి జట్టు వర్గాలు.

Virat Kohli and Rohit Sharma
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ

ఇంగ్లాండ్​తో టెస్టులు, వన్డేలు, టీ20ల సిరీస్ కోసం ఆటగాళ్లందరూ నెలన్నర పాటు బుడగలో గడిపారు. మైదానంలోనే కాదు, హోటల్లోనూ ఆటగాళ్లు ఎక్కువ సమయం కలిసి గడిపారు. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్ మధ్య కూడా అంతరాలు తొలగిపోయి మంచి మిత్రుల్లా మారినట్లు జట్టు వర్గాల సమాచారం. ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడం మామూలే అని.. అయితే తమ మధ్య చిన్న చిన్న అంతరాలు ఉన్నప్పటికీ దీన్నో పెద్ద వివాదంగా చూస్తున్నట్లు కోహ్లీ, రోహిత్ గుర్తించారని, ఇంగ్లాండ్​తో సిరీస్ సందర్భంగా ఇద్దరి మధ్య అంతరం తొలగిపోయి సన్నిహితంగా మారారని భారత జట్టుతో కలిసి పనిచేసే సిబ్బంది ఒకరు తెలిపారు. ఇంగ్లాండ్​తో చివరి టీ20 సందర్భంగా కోహ్లీ, రోహిత్ ఓవెనర్లుగా దిగి, చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేయడం.. వివిధ మ్యాచ్​లో బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాల గురించి తరచుగా మాట్లాడుకోవడం.. కొన్నిసార్లు రోహిత్​కు బాధ్యతలు అప్పగించి కోహ్లీ బౌండరీ దగ్గరికి వెళ్లడం లాంటి పరిణామాలు వీరి మధ్య బలపడ్డ బంధానికి సూచికలుగా జట్టు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు మేటి ఆటగాళ్ల మధ్య ఇలాంటి సమన్వయం జట్టుకు ఎంతో మేలు చేస్తుందని, టీ20 ప్రపంచకప్​నకు సన్నద్ధమవుతున్న దశలో ఇది మంచి పరిణామమని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.