ETV Bharat / sports

మలన్​ను ఓపెనర్​గా పంపాలి: వాన్ - జో రూట్ మైఖెల్ వాన్

టీమ్ఇండియాతో జరిగిన టీ20 సిరీస్​ను కోల్పోయిన ఇంగ్లాండ్​ జట్టుకు పలు సూచనలు చేశాడు ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్. బ్యాటింగ్ ఆర్డర్​లో మార్పులు చేయాలని సూచించాడు.

Malan
మలన్​
author img

By

Published : Mar 22, 2021, 12:03 PM IST

టీమ్ఇండియాతో జరిగిన టీ20 సిరీస్​ను 3-2 తేడాతో కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. ఈ విషయమై స్పందించిన ఇంగ్లీష్ జట్టు మాజీ కెప్టెన్ వాన్.. బ్యాటింగ్ ఆర్డర్​లో పలు మార్పులు చేయాలని సూచించాడు. టీ20ల్లో నెంబర్ వన్ బ్యాట్స్​మన్​గా ఉన్న డేవిడ్ మలన్​ను ఓపెనర్​గా దింపాలని సూచించాడు. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్​ ఉన్న దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా పుంజుకోవాలని తెలిపాడు.

"ఆరు, ఏడో స్థానంలో ఓ కుడిచేతి వాటం బ్యాట్స్​మన్​ను దింపాలి. డేవిన్ మలన్ అద్భుత ఆటగాడు, మంచి ఫామ్​లో ఉన్నాడు. అందుచేత అతడిని మూడో స్థానంలో కాకుండా ఓపెనర్​గా పంపాలి. సామ్ బిల్లింగ్స్​ను లోయర్ ఆర్డర్​లో ఫినిషర్​గా దించాలి. కుడిచేతి వాటం బ్యాట్స్​మన్ అయిన బెయిర్ ​స్టోను మిడిలార్డర్​లో పంపాలి. టీ20 ప్రపంచకప్ దగ్గర పడుతున్న తరుణంలో టెస్టు సారథి రూట్​ను టీ20ల్లోకి తీసుకోవాలి."

ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్​లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు వన్డే సిరీస్ కోసం సమాయత్తమవుతోంది. ఈ సిరీస్ మంగళవారం (మార్చి 23) నుంచి ప్రారంభంకానుంది. తొలి వన్డే పుణె వేదికగా జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.