ETV Bharat / sports

మైదానంలో సిక్సులు కొడుతున్న షారుక్​ఖాన్ - క్రికెట్ న్యూస్

ఐపీఎల్​లో తొలిసారి ఆడబోతున్న పంజాబ్ బ్యాట్స్​మన్ షారుక్​ ఖాన్.. తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నాడు. ఆ వీడియోను జట్టు ట్విట్టర్​లో పంచుకుంది.

Punjab Kings Show Off Shahrukh Khan's Six-Hitting Prowess
మైదానంలో సిక్సులు కొడుతున్న షారుక్​ఖాన్
author img

By

Published : Apr 4, 2021, 9:07 PM IST

మైదానంలో షారుక్ ఖాన్ సిక్సులు కొడుతూ కనిపించాడు. అవును మీరు విన్నది నిజమే, కానీ ఇక్కడ ఉన్నది హీరో షారుక్ కాదు క్రికెటర్ షారుక్. తన పేరుతో అందరి దృష్టిని ఆకర్షించిన ఇతడు.. ఇప్పుడు మైదానంలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడు బ్యాటింగ్ చేస్తున్న వీడియోను పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేసింది. కింగ్ ఖాన్ అంటూ అందులో రాసుకొచ్చింది.

ఫిబ్రవరిలో జరిగిన వేలంలో షారుక్​ఖాన్​ను పంజాబ్,​ రూ.5.25 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇతడితో పాటు రిచర్డ్​సన్(రూ.14 కోట్లు), మెరిడిత్(రూ.8 కోట్లు), డేవిడ్ మలన్(రూ.1.5 కోట్లు), హెన్సిక్స్(రూ.4.2 కోట్లు), జలజ్ సక్సేనా, సౌరభ్ కుమార్, ఉత్కర్ష్ సింగ్​లను వేలంలో దక్కించుకుంది.

కేఎల్ రాహుల్​ కెప్టెన్​గా ఉన్న పంజాబ్ కింగ్స్.. ఈ సీజన్​లో తమ తొలి మ్యాచ్​ను రాజస్థాన్ రాయల్స్​తో ఏప్రిల్ 12న ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.