ETV Bharat / sports

'ఖేల్​రత్న పొందేందుకు నాకు అర్హత లేదు' - latest harbhajan khel ratna issue updates

ఖేల్​ రత్నకు సూచించిన వారి నుంచి తన పేరును తొలగించడంపై టీమ్​ఇండియా మాజీ దిగ్గజ బౌలర్​ హర్భజన్​ సింగ్​ స్పందించాడు. అవార్డు పొందేందుకు తనకు అర్హత లేదు కాబట్టే పంజాబ్​ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపాడు.

Punjab government right to withdraw my name, I'm not eligible for Khel Ratna: Harbhajan Singh
హర్భజన్
author img

By

Published : Jul 18, 2020, 6:08 PM IST

Updated : Jul 18, 2020, 6:30 PM IST

ఖేల్​రత్న అవార్డుకు సూచించిన వారిలోంచి పంజాబ్​ ప్రభుత్వం తన పేరును తొలగించడంపై టీమ్​ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్​ సింగ్ స్పందించాడు. ఈ అవార్డుకు తాను అర్హుడిని కాదని అన్నాడు. గత మూడేళ్లుగా అథ్లెట్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే పేర్లను షార్ట్​లిస్ట్​ చేసినట్లు భజ్జీ వెల్లడించాడు.

Punjab government right to withdraw my name, I'm not eligible for Khel Ratna: Harbhajan Singh
హర్భజన్

"ప్రియమైన మిత్రులారా, ఇటీవలే ఖేల్​​రత్న నామినేషన్ల నుంచి ప్రభుత్వం నా పేరును తొలగించడంపై అనేక పోన్​ కాల్స్​ వస్తున్నాయి. అసలైన నిజం ఏంటంటే.. నాకు ఆ పురస్కారం పొందే అర్హత లేదు. ఇందులో పంజాబ్​ ప్రభుత్వం తప్పు ఎంతమాత్రం లేదు. మీడియాలో ఈ విషయంపై ఎటువంటి పుకార్లు సృష్టించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు."

-హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా బౌలర్​

టీమ్​ఇండియా తరఫున ఇప్పటివరకు 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20​ మ్యాచ్​లు ఆడాడు హర్భజన్. అన్ని ఫార్మాట్లలో కలిపి 711 వికెట్లు పడగొట్టాడు. ఇక టెస్టుల్లో 417 వికెట్లు సొంతం చేసుకొని.. భారత్​లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. 2016 నుంచి జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఎప్పటికైనా మళ్లీ జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

2019లో ఖేల్​రత్న అవార్డుకు హర్భజన్​ నామినేషన్​ను పంజాబ్​ క్రీడా మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. అందుకు సంబంధించిన పత్రాలు ఆలస్యంగా చేరుకోవడమే కారణమని తెలిపింది. అయితే ఈ ఏడాది మాత్రం తన నామినేషన్​ను పునఃపరిశీలించాలని మంత్రిత్వ శాఖను కోరాడు భజ్జీ. మూడేళ్లుగా క్రికెట్​కు దూరంగా ఉండటం వల్ల ఆ అవార్డుకు తాను అర్హుడిని కాదని ఈ విధంగా చేసినట్లు వెల్లడించాడు.

ఇదీ చూడండి:ఆ నిర్ణయం విషయంలో సచిన్​కు భజ్జీ మద్దతు​

Last Updated : Jul 18, 2020, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.