ETV Bharat / sports

'పుజారాతో ఆట అంటే పెద్ద సవాలే!' - నాథన్​ లియోన్ వార్తలు

టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా గురించి సిరీస్​ ప్రారంభానికి ముందే తామంతా లోతుగా ఆలోచించినట్లు ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్​ లియోన్​ అన్నాడు. పుజారా లాంటి ప్రపంచస్థాయి బ్యాట్స్​మన్​తో ఆడడం పెద్ద సవాలేనని వెల్లడించాడు.

Pujara a world-class batsman, will be a big challenge for rest of series: Lyon
'పుజారాతో ఆట అంటే పెద్ద సవాలే!'
author img

By

Published : Dec 23, 2020, 1:15 PM IST

టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా వికెట్​ను పడగొట్టేందుకు తమ జట్టు ఆటగాళ్లంతా కలిసి లోతుగా ఆలోచించామని అంటున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్​ లియోన్​. పుజారా లాంటి ప్రపంచస్థాయి బ్యాట్స్​మన్​తో ఆడటం సవాలుతో కూడుకున్నదని వర్చువల్​ ప్రెస్​ మీట్​లో వెల్లడించాడు.

ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్​ లియోన్​ వర్చువల్​ ఇంటర్వ్యూ

"మీతో నిజాయతీగా ఉండటానికి మా రహస్యాలను బయటకు పెట్టలేను. కానీ, పుజారా లాంటి ప్రపంచస్థాయి బ్యాట్స్​మన్​ సిరీస్​ మొత్తం మాకో పెద్ద సవాలు. సిరీస్​ ప్రారంభానికి ముందు అతడి ఆటతీరు గురించి లోతుగా చర్చించుకున్నాం. అడిలైడ్​లో మా ప్రణాళికలు కలిసి రావడం ఆనందంగా ఉంది. అతడి కోసం మరికొన్ని ప్రణాళికలను రూపొందిస్తున్నాం. వాటిలో ఆ బ్యాట్స్​మన్​ చిక్కుకునే అవకాశం ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లకు సవాళ్లు చేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. పుజారా కచ్చితంగా అలాంటి వాళ్లలో ఒకరు".

- నాథన్​ లియోన్​, ఆస్ట్రేలియా స్పిన్నర్​

అడిలైడ్​లో టీమ్​ఇండియాతో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో పుజారా 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్​లో ఆసీస్​ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇదీ చూడండి: బాక్సింగ్​ డే టెస్టుకు వార్నర్​ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.