డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 8 నెలల నిషేధం ఎదుర్కొన్నాడు యువ క్రికెటర్ పృథ్వీ షా. ఈ నెల 16తో నిషేధ కాలం పూర్తి కానుంది. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(జాతీయ టీ20) మ్యాచుల్లో ఈ ఆటగాడు బరిలో దిగే అవకాశముందని తెలుస్తోంది.
శనివారం ఈ క్రికెటర్ పుట్టినరోజు సందర్భంగా పృథ్వీ తన పునరాగమనాన్ని తెలుపుతూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. " 20 ఏళ్లు నిండాయి. పృథ్వీ షా 2.0 మీ ముందుకొస్తున్నాడు. త్వరలోనే మైదానంలో కనబడతా" అని ట్వీట్ చేశాడు.
-
I turn 20 today. I assure it will be Prithvi Shaw 2.0 going forward. Thank u for all the good wishes & support. Will be back in action soon. #motivation #hardwork #believe pic.twitter.com/SIwIGxTZaJ
— Prithvi Shaw (@PrithviShaw) November 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I turn 20 today. I assure it will be Prithvi Shaw 2.0 going forward. Thank u for all the good wishes & support. Will be back in action soon. #motivation #hardwork #believe pic.twitter.com/SIwIGxTZaJ
— Prithvi Shaw (@PrithviShaw) November 9, 2019I turn 20 today. I assure it will be Prithvi Shaw 2.0 going forward. Thank u for all the good wishes & support. Will be back in action soon. #motivation #hardwork #believe pic.twitter.com/SIwIGxTZaJ
— Prithvi Shaw (@PrithviShaw) November 9, 2019
ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న షా.. ఈ మెగా టీ20 టోర్నీలో ముంబయి ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సమాచారం. ఈనెల 16 తర్వాత అతడికి జట్టులో చోటివ్వడంపై ఆలోచిస్తామని ఆ జట్టు చీఫ్ సెలక్టర్ మిలింద్ రెగే చెప్పాడు. జాతీయ టీ20 టోర్నీలో భాగంగా ఈనెల 17న అసోంతో మ్యాచ్ ఆడనుంది ముంబయి. ఆ పోరులో పృథ్వీ బరిలోకి దిగే అవకాశముందని సమాచారం.
భారత్ తరఫున రెండు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన ఈ ముంబయి సంచలనం.. అరంగేట్రంలోనే సెంచరీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
ఏం జరిగిందంటే...!
గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో దగ్గుతో బాధపడుతున్న షా.. బోర్డుకు చెప్పకుండా ఓ దగ్గుమందు ఉపయోగించాడు. అందులో వాడా నిషేధిత ఉత్ప్రేరకం ఉంది. ఈ కారణంతోనే పృథ్వీపై వేటు పడింది. ఇలానే మరో ఇద్దరు క్రికెటర్లు 6-8 నెలలు మైదానంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించింది బీసీసీఐ.