భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో మాట్లాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇటీవలే గంగూలీకి గుండె పోటు రావడం వల్ల 'యాంజియోప్లాస్టీ' చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో దాదా ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు మోదీ.
గంగూలీ త్వరగా కోలుకోవాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో దాదా సతీమణితోనూ మాట్లాడారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని కోల్కతా ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.