ETV Bharat / sports

పొట్టి కప్పు దారిలో ఓ గట్టి సిరీస్‌ - మొతేరా స్టేడియం

ఈ ఏడాది భారత్​ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్​కప్​కు ముందు టీమ్​ఇండియా ఆడనున్న చివరి పొట్టి సిరీస్ ఇదే. ఇంగ్లాండ్​ వంటి బలమైన జట్టుతో ఈ పోటీలో నెగ్గి.. ప్రపంచకప్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలనుకుంటోంది కోహ్లీ సేన. సొంతగడ్డపై ఆడనుండటం భారత్​కు కలిసొచ్చే అంశం కాగా.. ఇప్పటికే టెస్టు సిరీస్​ను కోల్పోయిన ఇంగ్లాండ్​ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అహ్మదాబాద్​ వేదికగా తొలి టీ20 ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

preview on india vs england t20 series
పొట్టి కప్పుకు ముందు ఇంగ్లాండ్​తో గట్టి సిరీస్‌
author img

By

Published : Mar 12, 2021, 6:43 AM IST

Updated : Mar 12, 2021, 7:02 AM IST

వేసవిలో ఐపీఎల్‌ వస్తుంది. కానీ అంతకంటే ముందే వేడెక్కించే సిరీస్‌కు వేళైంది. ఉర్రూతలూగించే ధనాధన్‌ ఆటకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో భారత్‌ అయిదు టీ20ల సిరీస్‌ షురూ అయ్యేది శుక్రవారమే! టెస్టు సిరీస్‌ గెలిచి హుషారుగా ఉన్న టీమ్‌ఇండియా.. అక్టోబర్‌లో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సమరంలో ఇంగ్లిష్‌ జట్టును ఓడించి సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. కానీ మోర్గాన్‌ బృందం కూడా అంతే బలంగా ఉన్న నేపథ్యంలో ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.

అదిరే ఫామ్‌.. బలమైన రిజర్వ్‌ బెంచ్‌.. సొంతగడ్డ.. ఇన్ని అనుకూలతల మధ్య నంబర్‌వన్‌ జట్టు ఇంగ్లాండ్‌తో అయిదు టీ20ల సమరానికి భారత్‌ సై అంటోంది. శుక్రవారం తొలి టీ20 మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. పొట్టి కప్పు ముందు జరగనున్న ఆఖరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌ ఇది. మేళవింపును తుదిగా ఖరారు చేసుకోవాలనుకుంటున్న భారత్‌కు ఈ సిరీస్‌ ఎంతో కీలకం.

రాహులే ఓపెనర్‌

ఈ సిరీస్‌లో రెగ్యులర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు జతగా ఎవరు బరిలో దిగుతారా అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. రోహిత్‌కు తోడుగా కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా రోహిత్‌-రాహుల్‌ జోడీ అదిరే ఆరంభాలను ఇచ్చిందని.. ఇదే జంటను ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కొనసాగిస్తున్నట్లు.. శిఖర్‌ ధావన్‌ రిజర్వ్‌గా ఉంటాడని పేర్కొన్నాడు. ఒకవేళ రోహిత్‌-రాహుల్‌ ఇద్దరిలో ఎవరికైనా గాయాలు అయితే అప్పుడు శిఖర్‌ ఓపెనింగ్‌కు వస్తాడని విరాట్‌ చెప్పాడు. నాలుగో స్థానం కోసం శ్రేయస్‌, సూర్యకుమార్‌ పోటీపడుతున్నారు. పంత్‌, హార్దిక్‌ తుది జట్టులో ఆడడం ఖాయం కాబట్టి మిడిలార్డర్‌లో వీరిద్దరిలో ఒకరికే ఛాన్స్‌ లభిస్తుంది. అనుభవం ఉన్న శ్రేయస్‌కే ఆ అవకాశం దక్కొచ్చు.

భువీదే ఆ భారం:

ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్న నటరాజన్‌ గాయం కారణంగా సిరీస్‌ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు బౌలింగ్‌ విభాగాన్ని నడిపించే బాధ్యత అనుభవజ్ఞుడైన భువనేశ్వర్‌ కుమార్‌దే. చివరిగా 2019 డిసెంబర్‌లో టీమ్‌ఇండియాకు ఆడిన భువి.. ఎలా బౌలింగ్‌ చేస్తాడనేది ఆసక్తికరం. రెండో పేసర్‌ స్థానం కోసం శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, సైని మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. బ్యాటింగ్‌ను దృష్టిలో పెట్టుకుంటే శార్దూల్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. స్పిన్‌ విభాగంలో చాహల్‌కు జతగా వాషింగ్టన్‌ సుందర్‌ లేదా అక్షర్‌ పటేల్‌కు ఛాన్స్‌ దక్కొచ్చు. పిచ్‌ స్లో బౌలర్లకు అనుకూలించే నేపథ్యంలో ఈ ముగ్గురూ తుది జట్టులో ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

"ప్రపంచకప్‌ ముంగిట మేం ఆడేది ఈ అయిదు టీ20లే. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భారత కుర్రాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జట్టు సమతూకంగా ఉంది. కొత్తగా వచ్చిన ఆటగాళ్ల వల్ల బ్యాటింగ్‌ లోతు పెరిగింది. గతంలో ఆడినట్లుగా కాకుండా మా బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించబోతున్నారు. ఆరంభంలో ఒకటి, రెండు వికెట్లు పడినా దూకుడు కొనసాగించాలని ఆశిస్తున్నా. ఏ దశలోనైనా ఆట స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లు జట్టులో చాలామంది ఉండడం కలిసొచ్చే అంశం. ప్రపంచకప్‌ ముంగిట ఇంగ్లాండ్‌ లాంటి బలమైన జట్టుతో ఆడాలనే ఎవరైనా కోరుకుంటారు."

-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్.

వాళ్లతో జాగ్రత్త

మోర్గాన్‌.. బట్లర్‌.. బెయిర్‌స్టో.. రాయ్‌.. మలన్‌.. స్టోక్స్‌ ఈ లైనప్‌ చూస్తేనే అర్థమవుతుంది ఇంగ్లాండ్‌ ఎంత బలంగా ఉందో చెప్పడానికి! టీ20లు అంటే విరుచుకుపడి ఆడే ఆ జట్టు.. భారత్‌తో సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ చేజార్చుకున్న ఇంగ్లాండ్‌.. ప్రతీకారం కోసం పూర్తి స్థాయి జట్టుతో సిద్ధమైంది. టీ20ల్లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌తో పాటు టాప్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌, సామ్‌ కరన్‌ జట్టుతో చేరారు.

preview on india vs england t20 series
ఇయాన్ మోర్గాన్

దీంతో ఇంగ్లాండ్‌ బలీయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒంటి చేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేసే స్టోక్స్‌, కరన్‌లతో భారత్‌ జాగ్రత్తగా ఉండక తప్పదు. బౌలింగ్‌లోనూ ఇంగ్లాండ్‌ జట్టు భారత్‌కు దీటుగా ఉంది. ఆర్చర్‌, అలీ, వుడ్‌, జోర్డాన్‌, రషీద్‌ లాంటి మ్యాచ్‌ విన్నర్లు ఇంగ్లాండ్‌ జట్టులో ఉన్నారు. అయితే 2018 నుంచి టీ20ల్లో వారి బౌలింగ్‌ ఎకానమీ రేటు దారుణంగా ఉండడం ఒక్కటే ఇంగ్లాండ్‌ను కలవరపరిచే అంశం.

పరుగుల పిచ్‌

మొతేరా పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. మూడు, నాలుగు టెస్టులకు ఉపయోగించిన పిచ్‌తో పోలిస్తే ఈ పిచ్‌ భిన్నంగా ఉండబోతోంది. ఈ ట్రాక్‌పై బ్యాట్స్‌మెన్‌కు పరుగుల పండగ ఖాయం. అయితే ఈ జనవరిలో ముస్తాక్‌ అలీ టోర్నీ ఆడినప్పుడు పిచ్‌ నుంచి స్పిన్నర్లకు సహకారం అందింది. ఇక్కడ ఏడు మ్యాచ్‌లు జరగ్గా అయిదింట్లో తొలుత బౌలింగ్‌ చేసిన జట్టే నెగ్గింది. ఈ నేపథ్యంలో టాస్‌ కీలకం కాబోతోంది.

  • పూర్తయిన గత 15 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌ రెండింట్లో మాత్రమే ఓడిపోయింది.
  • భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య 14 టీ20లు జరిగాయి. చెరో ఏడు గెలిచాయి. అయితే గత అయిదు మ్యాచ్‌ల్లో టీమ్‌ ఇండియా నాలుగింట్లో నెగ్గింది.
  • 3000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్​మెన్​గా నిలువడానికి విరాట్​ కోహ్లీకి 72 పరుగులు కావాలి.

జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, రాహుల్‌, కోహ్లి (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్​‌ పంత్‌, పాండ్య, అక్షర్‌/సుందర్‌, శార్దూల్‌, భువనేశ్వర్‌, చాహల్‌, దీపక్‌ చాహర్‌

ఇంగ్లాండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, బట్లర్‌, మలన్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, జోర్డాన్‌, ఆర్చర్‌/మార్క్‌ వుడ్‌, ఆదిల్‌ రషీద్‌

ఇదీ చదవండి: 'ఐపీఎల్‌లో ఆడిన అనుభవం గొప్పది.. 'వెల' కట్టలేనిది'

Last Updated : Mar 12, 2021, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.