ETV Bharat / sports

అతిపెద్ద క్రికెట్​ స్టేడియానికి రాష్ట్రపతి శ్రీకారం - gujarath

భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్లు ఎంతగానో ఎదురుచూసిన అతిపెద్ద క్రికెట్​ స్టేడియాన్ని ప్రారంభించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. గుజరాత్​ అహ్మదాబాద్​లో పునర్నిర్మించిన ఈ సర్దార్​ పటేల్​ మొతేరా స్టేడియానికి.. భారత్​- ఇంగ్లాండ్​ పింక్​ టెస్టుకు ముందు నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు కూడా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 63 ఎకరాల్లో రూ. 800 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియానికి లక్షా 32 వేల సీటింగ్​ సామర్థ్యముంది.

world's biggest cricket stadium in Ahmedabad
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియానికి రాష్ట్రపతి శ్రీకారం
author img

By

Published : Feb 24, 2021, 5:15 PM IST

గుజరాత్‌ మొతేరాలో పునర్నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, గుజరాత్​ ఉప ముఖ్యమంత్రి నితిన్​ పటేల్​ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

world's biggest cricket stadium
నరేంద్ర మోదీ స్టేడియం
world's biggest cricket stadium
నరేంద్ర మోదీ స్టేడియం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి దంపతులు, అమిత్​ షా, కిరణ్​ రిజిజు
world's biggest cricket stadium
క్రికెట్​ అభిమానుల సందడి

ఈ సర్దార్​ పటేల్ మొతేరా స్టేడియం పేరును.. నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు.

world's biggest cricket stadium
నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం

దాదాపు 63 ఎకరాల విస్తీర్ణంలో.. లక్షా 32 వేల మంది ప్రేక్షకులు కూర్చొనే సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో భారత్​, ఇంగ్లాండ్​ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. మార్చి 4న జరిగే చివరి టెస్టు సహా ఐదు టీ20లు కూడా ఇదే మైదానంలో నిర్వహించనున్నారు.

మోదీ వల్లే- అందుకే..

​'ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దీన్ని నిర్మించాలని భావించారని.. అందుకే స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు' కోవింద్‌ చెప్పారు.

''ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ స్టేడియాన్ని నిర్మించాలని భావించారు. అప్పుడు.. గుజరాత్​ క్రికెట్​ సంఘానికి అధ్యక్షుడు కూడా మోదీనే. అందుకే ఆయన పేరు పెట్టాలని నిర్ణయించాం.''

- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

భారత్​ను క్రికెట్​ హబ్​గా పిలుస్తారని.. అలాంటి దేశంలో అతిపెద్ద స్టేడియం ఉండటం సముచితమని అభిప్రాయపడ్డారు కోవింద్​. ఈ నరేంద్ర మోదీ స్టేడియం భారత దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని, సరికొత్త గుర్తింపును ఇస్తుందని పేర్కొన్నారు.

world's biggest cricket stadium
63 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం

ఇదే స్టేడియం ప్రాంగణంలో ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలతో నిర్మించనున్న.. సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ స్పోర్ట్స్​ ఎన్​క్లేవ్​కు రాష్ట్రపతి భూమి పూజ చేశారు.

world's biggest cricket stadium
సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ స్పోర్ట్స్​ కాంప్లెక్స్​కు భూమిపూజ
world's biggest cricket stadium
స్పోర్ట్స్​ కాంప్లెక్స్​ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన జనం

మోదీ డ్రీమ్​ ప్రాజెక్ట్​..

ఈ క్రికెట్​ స్టేడియం మోదీ కలల ప్రాజెక్ట్​ అని.. అందుకే ఆయన పేరు పెట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.

నరేంద్ర మోదీ స్టేడియం.. ప్రపంచంలో అతిపెద్దదే కాకుండా ఉత్తమమైందని కిరణ్​​ రిజిజు అన్నారు. స్టేడియంలోని ప్రపంచస్థాయి సౌకర్యాలను ఆయన రాష్ట్రపతి, హోం మంత్రితో కలిసి పరిశీలించారు.

world's biggest cricket stadium
స్టేడియంలో కిరణ్​ రిజిజు

ఇదీ చూడండి: 'మొతేరాను చూసి గర్వపడుతున్నా'

ఒలింపిక్స్​ కూడా సాధ్యమే..

త్వరలో ఇదే అహ్మదాబాద్​లోని నరాన్​పురాలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. వివిధ క్రీడా విభాగాలకు సంబంధించిన 20 స్టేడియాలను.. 215 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టారు. అథ్లెట్లు, కోచ్​లకు కూడా అత్యుత్తమ సదుపాయాలు అందించే ఉద్దేశంతో రూపొందించనున్నారు.

నరేంద్ర మోదీ స్టేడియం, సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ స్పోర్ట్స్​ ఎన్​క్లేవ్​, నరాన్​పుర్​ స్పోర్ట్స్​ కాంప్లెక్స్​లలో.. కామన్​వెల్త్​ గేమ్స్​, ఆసియా క్రీడలు సహా ఒలింపిక్స్​ కూడా నిర్వహించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు షా.

'నరేంద్ర మోదీ స్టేడియం' ప్రత్యేకతలు ఇవే..

  • మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​(90 వేల సీటింగ్​ సామర్థ్యం)ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియంగా ఘనత.
    world's biggest cricket stadium
    సువిశాల క్రీడా ప్రాంగణం
  • 63 ఎకరాల విస్తీర్ణంలో రూ. 800 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంలో లక్షా 32 వేల మంది కూర్చోవచ్చు.
    world's biggest cricket stadium
    లక్షా 32 వేల మంది కూర్చొనేలా విశాల మైదానం
  • ఈ స్టేడియం మొత్తం వైశాల్యం.. 32 ఒలింపిక్​ సైజ్​ సాకర్(ఫుట్​బాల్​)​ మైదానాలకు సమానం.
  • అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ దీని సొంతం. వర్షం పడి ఆగిపోయిన 30 నిమిషాల్లోనే.. నీటిని బయటకు పంపించేయొచ్చు.
  • షాడో-లెస్​ కోసం తొలిసారి భారత్​లో హై మాస్ట్​ ఫ్లడ్​లైట్లకు బదులు.. ఎల్​ఈడీ లైట్లను ఉపయోగించారు.
    led lights
    మైదానంలో ప్రత్యేకంగా నిలిచే ఎల్​ఈడీ లైట్లు
    world's biggest cricket stadium
    ఎల్​ఈడీ లైట్లు
  • ఆటగాళ్ల కోసం నాలుగు డ్రెస్సింగ్​ రూంలు ఉన్న ఏకైక స్టేడియం ఇదే కావడం మరో విశేషం. ఒకే రోజు వరుస మ్యాచ్​లు నిర్వహించాల్సి వస్తే ఇది ఉపయోగపడనుంది.
    world's biggest cricket stadium
    డ్రెస్సింగ్​ రూంలు
  • క్రికెట్​ అకాడమీ, ఇండోర్​ ప్రాక్టీస్​ పిచ్​లు, రెండు వేర్వేరు ప్రాక్టీస్​ గ్రౌండ్​లు ఉండటం ఈ స్టేడియం ప్రత్యేకతలు.
    world's biggest cricket stadium
    ప్రపంచ స్థాయి క్రీడా సదుపాయాలు
  • ఈ స్టేడియంలో 11 పిచ్​(నలుపు, ఎర్రమట్టి)లను రూపొందించారు. ప్రపంచంలో ఇలాంటి స్టేడియం ఇదొక్కటే కావడం విశేషం.

పునర్నిర్మాణం కోసం 2015లో మూసేసిన ఈ స్టేడియం.. భారత క్రికెట్​లో ఎన్నో మైలురాళ్లకు సాక్ష్యంగా నిలిచింది.

  • భారత క్రికెట్​ దిగ్గజం సునీల్​ గావస్కర్​.. టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది ఈ మైదానంలోనే. 1987లో పాకిస్థాన్​తో మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు.
    world's biggest cricket stadium
    సునీల్​ గావస్కర్​
  • కపిల్​ దేవ్​.. 1994లో ప్రపంచంలోనే అత్యధిక టెస్టు వికెట్ల(432) వీరుడిగా నిలిచింది ఈ స్టేడియంలోనే. సర్​ రిచర్డ్​ హ్యాడ్లీని దాటి అప్పట్లో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.
  • మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్​ టెస్టుల్లో తన తొలి డబుల్​ సెంచరీ (1999లో న్యూజిలాండ్​పై) ఇక్కడే చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 30 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నది ఇదే స్టేడియంలో.
  • 2011 ప్రపంచ కప్​లో వన్డేల్లో 18 వేల పరుగుల సాధించిన తొలి క్రికెటర్​గా ఘనత సాధించాడు సచిన్​. ఈ మైదానంలోనే ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
  • 2008- భారత పర్యటనలో సౌతాఫ్రికా క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​.. ఇండియాపై టెస్టుల్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు.

ఇదీ చూడండి: గులాబీ బంతి.. ఎందుకింత స్పెషల్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.