మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన ప్లేయర్లతో 'ఉమెన్స్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్' జట్టును ప్రకటించింది ఐసీసీ. భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు మాత్రమే ఇందులో చోటు దక్కింది. విధ్వంసకర ఆటతీరుతో మెప్పించిన యువ సంచలనం షెఫాలీ వర్మ 12వ ప్లేయర్‌గా ఎంపికైంది.
ఫైనల్లో భారత్‌ను ఓడించి ఐదోసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు ఐసీసీ జట్టులో స్థానం దక్కింది. ఆసీస్ ఓపెనర్లు హేలీ, మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్‌తో పాటు ప్రపంచకప్‌లో 13 వికెట్లు సాధించి టాప్ బౌలర్‌గా నిలిచిన మేగన్ షట్, ఆల్‌రౌండర్ జొనాసెన్‌లు ఎంపికయ్యారు.
ఇంగ్లాండ్ నుంచి స్కీవర్, హీథర్ నైట్, సోఫీ ఎక్లెస్టోన్, అన్యా శ్రుబ్సోలే ఎంపికై నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నారు. రెండు ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన సౌతాఫ్రికా బ్యాట్‌ఉమెన్ లౌరా వోల్వర్డ్కు ఐసీసీ జట్టులో స్థానం లభించింది.
-
Introducing your Women's #T20WorldCup 2020 Team of the Tournament 🌟 pic.twitter.com/Eb4wQUc7Ls
— T20 World Cup (@T20WorldCup) March 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Introducing your Women's #T20WorldCup 2020 Team of the Tournament 🌟 pic.twitter.com/Eb4wQUc7Ls
— T20 World Cup (@T20WorldCup) March 9, 2020Introducing your Women's #T20WorldCup 2020 Team of the Tournament 🌟 pic.twitter.com/Eb4wQUc7Ls
— T20 World Cup (@T20WorldCup) March 9, 2020
టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది పూనమ్ యాదవ్. బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లు, న్యూజిలాండ్, శ్రీలంకపై ఒక్కో వికెట్, ఫైనల్లో మరో వికెట్‌తో మొత్తం 10 వికెట్లు పడగొట్టింది.
ప్రపంచకప్‌లో విధ్యంసకర బ్యాటింగ్‌తో అలరించిన టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ 158.25 స్ట్రైక్‌రేట్‌తో 163 పరుగులు చేసింది. ఈమెను 12వ ప్లేయర్‌గా ఎంపిక చేసింది ఐసీసీ.