సుదీర్ఘ కాలం బయో బబుల్‌లో ఉండడం వల్ల క్రికెటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతారని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బయో బబుల్‌లో ఉన్న క్రికెటర్లు నేరుగా ఐపీఎల్ బయో బబుల్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"భవిష్యత్తులో షెడ్యూలింగ్ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే రెండు మూడు నెలల పాటు బయో బబుల్‌లో ఉండడం ఆటగాళ్లకు చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. అందరి మానసిక దృఢత్వం ఒకేలా ఉండదు. కొందరికి ఉడికిపోతున్న భావన కలగొచ్చు. మార్పు కావాలి అని వారికి అనిపించవచ్చు. భవిష్యత్తులో పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నా"
-కోహ్లీ, టీమ్ఇండియా సారథి
ఐపీఎల్‌లో ఆటగాళ్లకు కొత్త సవాళ్లు తప్పవని చెప్పాడు కోహ్లీ. భారత క్రికెటర్లు కొంత విరామంతో గత ఐపీఎల్ నుంచి బయో బబుల్‌లో ఉంటూ వస్తున్నారు.