ETV Bharat / sports

'ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​ మజా ఉండదు'

author img

By

Published : May 18, 2020, 8:05 PM IST

ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లు నిర్వహిస్తే మజా ఉండదని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. కరోనా నుంచి కోలుకుని ఏడాదిలో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపాడు.

అక్తర్
అక్తర్

కరోనా నేపథ్యంలో క్రీడా టోర్నీల నిర్వహణ ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నారు నిర్వాహకులు. ఖాళీ మైదానాల్లో మ్యాచ్​లు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే అలాంటి మ్యాచ్​లు అస్సలు మజా ఉండవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.

"ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడటం వల్ల క్రికెట్‌ బోర్డులకు మేలు జరగవచ్చు. అయితే, ఇది అంతగా ఆకట్టుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌ ఆడటం వధువు లేని పెళ్లిలాంటిది. ఆటలు ఆడాలంటే స్టేడియం ప్రేక్షకులతో నిండిపోవాలి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఏడాదిలో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అనుకుంటున్నా."

-అక్తర్, పాక్ మాజీ క్రికెటర్

ఈ విషయమై ఇప్పటికే టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. ప్రేక్షకులు లేకపోతే ఆ మ్యాజిక్​ను చూడలేమని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.