ETV Bharat / sports

నెట్​ ప్రాక్టీసు​కు సిద్ధమైన పంజాబ్​, రాయల్స్ జట్లు - ఐపీఎల్​ నెట్​ ప్రాక్టీస్​

కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​, రాజస్థాన్​ రాయల్స్ జట్లు ఆరురోజుల క్వారంటైన్​ పూర్తి చేసుకున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి ఆటగాళ్లు నెట్​ ప్రాక్టీస్​ ప్రారంభించనున్నారు.

ipl
నెట్​ ప్రాక్టీస్
author img

By

Published : Aug 26, 2020, 3:03 PM IST

ఐపీఎల్​ నిమిత్తం గత వారం దుబాయ్​ చేరుకున్న కింగ్స్​ ఎలెవెన్ పంజాబ్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్ల సభ్యులు బుధవారం ఆరురోజుల క్వారంటైన్​ పూర్తి చేసుకున్నారు. ఆటగాళ్లందరికీ మూడు సార్లు కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెెగెటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ క్రమంలోనే చాలా నెలల తర్వాత తిరిగి శిక్షణలో పాల్గొననున్నారు. దుబాయ్​లో అధిక వేడి కారణంగా సాయంత్రం పూట ప్రాక్టీస్​ మొదలుపెట్టనున్నారు.

ఈ ఆరురోజుల క్వారంటైన్​ సమయంలో ఆటగాళ్లను వారి గదుల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా అనుమతించలేదు.

ఈ ఏడాది రాజస్థాన్​ రాయల్స్​​ ఫ్రాంచైజీకి మారిన డేవిడ్​ మిల్లర్​.. మంగళవారం దుబాయ్​ చేరుకున్నాడు. క్వారంటైన్​ పూర్తి చేసుకున్న తర్వాత జట్టుతో కలవనున్నాడు.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు గురువారానికి తమ క్వారంటైన్ పూర్తి చేసుకోనున్నాయి. బయో సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించే ఈ లీగ్​.. సెప్టెంబరు 19న ప్రారంభం కానునుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.