ETV Bharat / sports

ఇక్కడి వాడే.. కంగారూ గడ్డపై!

ఆస్ట్రేలియా జట్టులోకి మరో లెగ్​స్పిన్నర్​ దూసుకొస్తున్నాడు.. 19 ఏళ్లకే ఆ దేశ టీ20 జట్టు తలుపు తట్టాడు. అరంగ్రేట బిగ్​బాష్​ సీజన్​లోనే అదిరే ప్రదర్శనతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. అతనే.. తన్వీర్​ సంఘా. అతడు భారత సంతతి ఆటగాడు కావడం విశేషం.

Player of Indian descent in the Australian T20 squad
ఇక్కడి వాడే.. కంగారూ గడ్డపై!
author img

By

Published : Jan 29, 2021, 7:28 AM IST

న్యూజిలాండ్​లో వచ్చే నెలలో జరిగే టీ20 సిరీస్​ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించగానే అందరి దృష్టి తన్వీర్​ వైపే మళ్లింది. ఎవరా ఆటగాడు? అతని ప్రస్థానం ఏమిటీ? అనే ప్రశ్నలు రేకెత్తాయి. జలంధర్​ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే రహీంపూర్​ కాలా సంఘియాన్​కు చెందిన జోగా 1997లో సిడ్నీకి వలస వెళ్లాడు. అతని కొడుకే ఈ తన్వీర్​.

అక్కడ ట్యాక్సీ డ్రైవర్​గా పనిచేసే అతను.. పదేళ్ల వయసులో తన కొడుకును అక్కడి ఓ క్రికెట్​ క్లబ్​లో చేర్పించాడు. అయితే తన్వీర్​కు ఆ ఆట మీద ఇష్టం అనుకోకుండా ఏర్పడింది. స్థానిక గురుద్వారాలో వాలీబాల్​ సెషన్​ల విరామ సమయంలో క్రికెట్​ ఆడేవాడు. వేసవి సెలవుల్లో భారత్​లోని తన గ్రామానికి వచ్చినప్పుడు.. ఇక్కడ క్రికెట్లో నేర్చుకున్న టెక్నిక్​లను తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాక అమలుపరిచేవాడు. అలా మొదలైన తన క్రికెట్​ ప్రస్థానం ఘనంగా సాగుతోంది. పాఠశాల స్థాయిలో, వివిధ వయసు విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

గతేడాది అండర్​-19 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియా తరఫున విజయవంతమైన బౌలర్​గా నిలిచాడు. బిగ్​బాష్​ లీగ్​లో అరంగ్రేటం చేసి సిడ్నీ థండర్స్ తరఫున ఆడిన అతను.. ఈ సీజన్​లో అత్యధిక వికెట్లు (21 వికెట్లు) తీసిన మూడో బౌలర్​గా నిలిచాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తమ స్పిన్నర్లుగా పేరు తెచ్చుకున్న రషీద్​ఖాన్​, ఆడమ్​ జంపాలను అతను వెనక్కు నెట్టడం విశేషం.

పవర్​ ప్లేలో, చివరి ఓవర్లలో బౌలింగ్​ చేసే అతను ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. ఇప్పుడీ ప్రదర్శనతోనే తొలిసారి ఆస్ట్రేలియా టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగిన అతను ఇప్పటికే ఓ మంచి లెగ్​స్పిన్నర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుత ఆసీస్​ సీనియర్​ స్పిన్నర్​ లైయన్​కు తన్వీరే సరైన వారసుడంటూ అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ కెరీర్​ మొదలెట్టనున్న అతణ్ని.. ఇప్పటికే గొప్ప స్పిన్నర్లుగా ఎదిగిన వాళ్లతో పోల్చడం సరికాదు. జాతీయ జట్టు తరఫున కూడా తన్వీర్​ ఇదే ప్రదర్శన కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే జట్టులో సుస్థిర స్థానం దక్కుతుంది.

ఇదీ చదవండి: టీమ్ఇండియా క్రికెటర్లకు కొవిడ్​ నెగెటివ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.