బంగ్లాదేశ్‌తో ఆరంభమైన చారిత్రక డే/నైట్ టెస్టులో టీమిండియా పేసర్లు చెలరేగుతున్నారు. లంచ్ విరామానికి 73 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆ జట్టు. ఉమేశ్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ 2, మహ్మద్ షమి ఓ వికెట్ తీశారు. డేనైట్ టెస్టులో తొలి వికెట్ ఇషాంత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు.
పింక్ టెస్టులో తొలి వికెట్ తీసిన ఇషాంత్ శర్మ.. అనంతరం మహ్మదుల్లానూ ఔట్ చేశాడు. ఆఫ్ సైడ్ దిశగా వస్తున్న బంతిని డిఫెండ్ చేయబోయిన మహ్మదుల్లా కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దూరంగా వెళ్తున్న బంతిని కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు సాహా.
బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్(0), మహ్మద్ మిథున్(0), ముష్ఫికర్ రహీమ్(0) ముగ్గురు డకౌటవ్వడం విశేషం. ప్రస్తుతం నయీమ్ హసన్, లిటన్ దాస్(15) బ్యాటింగ్ చేస్తున్నారు. లంచ్ విరామానికే సగానికి పైగా వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసిన బంగ్లాదేశ్ పీకల్లోతూ కష్టాల్లో పడింది.
ఇదీ చదవండి: పింక్ టెస్టులో మొదటి వికెట్ తీసి ఇషాంత్ రికార్డు