ETV Bharat / sports

తొలి టెస్టులో అందుకే ఓడిపోయాం: కోహ్లీ - loss of first test respond by kohi

అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై దారుణంగా ఓడిపోవడం చాలా బాధగా ఉందని చెప్పిన టీమ్​ఇండియా సారథి కోహ్లీ.. ఆ వేదన మాటల్లో వర్ణించలేనిదని అన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో తమ జట్టు పుంజుకుని ప్రత్యర్థి జట్టుపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Dec 19, 2020, 3:42 PM IST

Updated : Dec 19, 2020, 5:30 PM IST

అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది టీమ్ఇండియా. రెండో ఇన్నింగ్స్​లో కేవలం 36 పరుగులకే ఆలౌటైన కోహ్లీసేనపై విమర్శలు కూడా వస్తున్నాయి. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన సారథి కోహ్లీ.. మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"ఈ ఓటమి వల్ల కలిగిన బాధను మాటల్లో వర్ణించలేను. 60 పరుగుల ఆధిక్యంలో ఉండి మూడో రోజు దారుణంగా విఫలమయ్యాం. రెండు రోజులు కష్టపడి మ్యాచులో ఆధిక్యంలో ఉండి 'గెలుపు చాలా కష్టం' అనే స్థితికి చేరుకున్నాం. ఈ రోజు మా బ్యాటింగ్​లో తీవ్రత దెబ్బతింది. మరింత జాగ్రత్తగా ఆడాల్సింది. ఆసీస్ బౌలర్లు తొలి ఇన్నింగ్స్​ మాదిరిగానే బంతులు వేశారు. కానీ మేమే పరుగులు సాధించడంపై దృష్టి పెట్టాం. ఆ మైండ్ సెట్ వల్లే ఇలా జరిగింది. మా ఆటగాళ్లు పరుగులు చేయడంలో కష్టపడటం వల్ల ప్రత్యర్థి బౌలర్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. తప్పకుండా రెండో టెస్టులో టీమ్​ఇండియా పుంజుకుని ప్రత్యర్థి జట్టుపై ప్రతీకారం తీర్చుకుంటుంది."

-కోహ్లీ టీమ్​ఇండియా సారథి.

టీమ్ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. 8 వికెట్ల తేడాతో గెలిచి నాలుగు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చూడండి : తొలి టెస్టులో భారత్​పై ఆస్ట్రేలియా ఘనవిజయం

Last Updated : Dec 19, 2020, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.