ETV Bharat / sports

'ఇంగ్లాండ్​కు ఆడితే చంపేస్తామన్నారు'

తనపై జాతివివక్ష చూపారని తెలిపిన ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ ఫిలిప్​ డిఫ్రీటస్​.. ఆ దేశం తరఫున క్రికెట్​ ఆడితే చంపేస్తానంటూ గతంలో కొంతమంది బెదిరించారని అన్నాడు.

PHILIP DEFRITEES
ఫిలిప్​ డిఫ్రీటస్
author img

By

Published : Jun 28, 2020, 7:15 AM IST

ఇంగ్లాండ్​ క్రికెట్​ జట్టు తరఫున ఆడితే తనను చంపేస్తామని బెదిరించేవాళ్లని ఆ దేశ మాజీ ఆల్​రౌండర్​ ఫిలిప్​ డిఫ్రీటస్​ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై గతంలో జాతివివక్ష చూపారని తెలిపాడు.

"నన్ను దూషిస్తూ నేషనల్​ ఫ్రంట్​ లేఖలు పంపేది. ఒక్కసారి కాదు రెండుమూడు సార్లు అలా జరిగింది. 'నువ్వు ఇంగ్లాండ్​కు ఆడితే కాల్చేస్తాం' అని ఓ లేఖలో రాసి పంపారు. దీంతో నా ఇంటికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరా. కారుపై నా పేరునూ తొలగించాల్సి వచ్చింది. లార్డ్స్​ టెస్టుకు రెండు రోజులు ముందు మ్యాచ్​లో ఆడాలా వద్దా అని ఆలోచించా. ఒకవేళ ఆడితే నాపై తుపాకీతో దాడి చేస్తారా? అని అనుకునేవాణ్ణి. నాకు ఎవరి నుంచి మద్దతు లభించలేదు. నా సమస్యను నేనే ఎదుర్కొన్నా"

-ఫిలిప్​ డిఫ్రీటస్, ఇంగ్లాండ్​ మాజీ ఆల్​రౌండర్.

నల్ల జాతీయుడైన ఫిలిప్..​ ఇంగ్లాండ్​ తరఫున 1986-1997మధ్య కాలంలో 44 టెస్టులు, 103 వన్డేలు ఆడాడు. ఆఫ్రో-అమెరికన్​ ఫ్లాయిడ్​ మృతితో ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు రేకేత్తిన నేపథ్యంలో ఫిలిప్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అతనో అజ్ఞాని

ఎఫ్​1 మాజీ అధ్యక్షుడు బెర్నీ ఎక్లెస్టోన్​పై ప్రపంచ ఛాంపియన్​ లూయిస్​ హామిల్టన్​ తీవ్ర విమర్శలు చేశాడు. అతనో అజ్ఞాని అని, చదువులేని వాడని విమర్శించాడు.

చాలా సందర్భాల్లో తెల్లవాళ్ల కంటే నల్ల జాతీయులే ఎక్కువుగా జాతి వివక్ష ప్రదర్శిస్తారు అని ఓ ఇంటర్వ్యూలో బెర్నీ చేసిన వ్యాఖ్యలపై లూయిస్​ విరుచుకుపడ్డాడు. ఫార్ములావన్​లో ఏకైక నల్లజాతీయుడైన ఎఫ్​1డ్రైవర్​ లూయిస్​ హామిల్డన్​.

ఇది చూడండి : 'ఏ టీమ్​ఇండియా బౌలర్​ ఆ రికార్డును ఛేదించలేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.