ETV Bharat / sports

టీమిండియాపై కోహ్లీ ట్వీట్ చేయొద్దంటూ పిటిషన్ - kohli sehwag

ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ.. కోహ్లీ, సెహ్వాగ్​ ట్వీట్స్​ చేయొద్దని ఓ పిటిషన్​ వేశారు. ఈ విషయం ఇప్పుడు వైరల్​గా మారింది.

టీమిండియాపై కోహ్లీ ట్వీట్ చేయొద్దంటూ పిటిషన్
కెప్టెన్ విరాట్ కోహ్లీ
author img

By

Published : Mar 11, 2020, 10:41 AM IST

ఈ వార్తపై మీరు నమ్మకం కుదరకపోవచ్చు. కానీ ఇది నిజం. టీమిండియా కెప్టెన్ కోహ్లీ, మాజీ ఓపెనర్​ సెహ్వాగ్​పై ఓ పిటిషన్ వేశారు. ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో భారత జట్టుకు వారు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్ చేయొద్దని అందులో పేర్కొన్నారు.

ఇంతకీ పిటిషన్​లో ఏముంది?

అభినవ్ ఠాకుర్ అనే ఓ వ్యక్తి.. 'ఛేంజ్.ఓఆర్​జీ' అనే వెబ్​సైట్​లో పిటిషన్​ కోసం పోల్ పెట్టాడు. ఐసీసీ ప్రధాన టోర్నీలు జరిగేటప్పుడు టీమిండియాకు.. కోహ్లీ, సెహ్వాగ్​లు శుభాకాంక్షలు చెప్పకూడదంటూ అందులో పేర్కొన్నాడు. ఒకవేళ అలా చేయడం ఆపకపోతే, వారి సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్​ చేయండని అందులో రాసుకొచ్చాడు.

Petition calls to stop Kohli from congratulating Team India
ఛేంజ్.ఓఆర్​జీ వెబ్​సైట్​లోని పిటిషన్

ఆదివారం జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్​ సెమీస్​లో భారత్​ ఓడిన తర్వాత ఈ పిటిషన్ ప్రారంభమైంది.​ ప్రస్తుతం 600 మంది పైచిలుకు నెటిజన్లు.. ఈ పిటిషన్​ కోసం సైన్ చేశారు. 1000 మందే లక్ష్యంగా సాగుతోంది ఇది.

ఇది చదవండి: 'మా జట్టుకు ధోనీ లాంటి ఫినిషర్​ అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.