ETV Bharat / sports

పాకిస్థాన్​ వన్డే జట్టు కొత్త కెప్టెన్​గా బాబర్ - పాకిస్థాన్ వన్డే కెప్టెన్​గా బాబర్ అజామ్

పాకిస్థాన్ జట్టుకు 2020-21 సీజన్​కు గానూ కొత్త వన్డే కెప్టెన్​ను నియమించింది పీసీబీ. ఇప్పటికే టీ20 జట్టు సారథిగా ఉన్న బాబర్ అజామ్​కు వన్డే సారథ్య బాధ్యతలూ అప్పగించింది.

బాబర్
బాబర్
author img

By

Published : May 14, 2020, 5:45 AM IST

పాకిస్థాన్​ జట్టుకు 2020-21 సీజన్​కు గానూ వన్డేల్లో కొత్త కెప్టెన్​ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ దేశ క్రికెట్ బోర్డు. యువ క్రికెటర్ బాబర్​ అజామ్​కు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే అజామ్ టీ20 జట్టుకు సారథిగా ఉన్నాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల కెప్టెన్సీని పూర్తిగా బాబర్​కు అప్పజెప్పుతూ పీసీబీ ప్రకటన చేసింది. టెస్టు జట్టుకు అజర్​ అలీని సారథిగా కొనసాగిస్తున్నారు.

"అజర్ అలీ, బాబర్​ అజామ్​లకు అభినందనలు. వారు భవిష్యత్​లో నిర్వర్తించే బాధ్యతలపై నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. వారిద్దరూ భవిష్యత్ ప్రణాళికలు రచించి జట్టును ఉన్నతంగా నిలుపుతారని ఆశిస్తున్నాం."

-మిస్బావుల్ హక్, చీఫ్ సెలక్టర్, కోచ్

పాక్​​ జట్టు... ఈ ఏడాది జులైలో ఐర్లాండ్​తో రెండు టీ20లు, జులై-సెప్టెంబర్​లో ఇంగ్లాండ్​తో మూడు టెస్టులు, మూడు టీ20లు, అక్టోబర్​లో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నవంబర్​లో జింబాబ్వేతో (స్వదేశంలో) మూడు వన్డేలు, మూడు టీ20లు, డిసెంబర్​లో న్యూజిలాండ్​తో రెండు టెస్టులు, మూడు టీ20లు, జనవరిలో దక్షిణాఫ్రికాతో (స్వదేశంలో) రెండు టెస్టులు, మూడు టీ20లు, ఏప్రిల్​లో జింబాబ్వేతో రెండు టెస్టులు మూడు టీ20లు ఆడాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.