టెస్టు క్రికెట్లో భారత బ్యాట్స్‌మెన్ చెతేశ్వర్ పుజారాకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని ప్రపంచ నంబర్‌వన్ బౌలర్, ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ అన్నాడు. స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో పుజారా తమకు వెన్నులో వణుకు పుట్టించాడని ఓ కార్యక్రమంలో కమిన్స్ తెలిపాడు.
"టెస్టుల్లో కఠినమైన బ్యాట్స్‌మెన్ చాలామందే ఉన్నారు. నా దృష్టిలో పుజారాకు బౌలింగ్ చేయడమే అత్యంత కష్టం. అతడు మాకు వెన్నులో వణుకు పుట్టించాడు. 2018-19 సిరీస్‌లో పుజారా గోడలా నిల్చున్నాడు. అతడిని ఔట్ చేయడం చాలా కష్టమైంది. రోజురోజుకూ అతడి ఏకాగ్రత మరింత పెరిగేది. నేను చూసినంత వరకు టెస్టు క్రికెట్లో క్లిష్టమైన బ్యాట్స్‌మన్ పుజారానే"
- కమిన్స్, ఆస్ట్రేలియా ఆటగాడు.
ఏడాదిన్నర కిందట ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో పుజారా కీలకపాత్ర పోషించాడు. 74 పైచిలుకు సగటుతో 3 సెంచరీలు సహా 521 పరుగులు రాబట్టాడు.
ఇదీ చూడండి : 'గెలిచినప్పుడు ధోనీ ఎక్కడున్నా.. ఓడినప్పుడు ముందుంటాడు'