ETV Bharat / sports

దివంగత క్రికెటర్‌కు 'D' ఆకారంలో ఘన నివాళులు - పీఎస్​ఎల్​ క్వాలిఫయర్స్​

ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్‌ డీన్‌జోన్స్‌కు ఘన నివాళులర్పించారు పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ ఆటగాళ్లు. తొలి క్వాలిఫయర్​ మ్యాచ్​కు ముందు D ఆకారంలో నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. సెప్టెంబర్​ 24న డీన్​జోన్స్​ కన్నుమూశారు.

pakisthan super league teams pay touching tribute to the cricket legend dean jones
దివంగత క్రికెటర్‌కు D ఆకారంలో ఘన నివాళులు
author img

By

Published : Nov 15, 2020, 3:20 PM IST

కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మార్చిలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. అప్పుడు లీగ్‌ దశ పూర్తికాగా కేవలం ప్లేఆఫ్స్‌ మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఐపీఎల్‌ కూడా పూర్తవడం వల్ల దాయాది దేశం మిగిలిన లీగ్​ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం తొలి క్వాలిఫయర్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ x కరాచి కింగ్స్‌ తలపడ్డాయి. మరో మ్యాచ్‌లో లాహోర్‌ కలందార్స్‌ x పెషావర్‌ జాల్మీ పోటీపడ్డాయి. అయితే, మ్యాచ్‌కు ముందు ముల్తాన్‌, కరాచీ ఆటగాళ్లు ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్‌ డీన్‌జోన్స్‌కు నివాళులర్పించారు.

pakisthan super league teams pay touching tribute to the cricket legend dean jones
పీఎస్​ఎల్​లో డీన్​జోన్స్​కు నివాళులు

ఐపీఎల్‌ సమయంలో ఓ క్రీడాఛానల్‌తో కలిసి పనిచేసేందుకు జోన్స్‌.. భారత్‌కు వచ్చారు. సెప్టెంబర్‌ 19న యూఏఈలో మెగా టీ20 లీగ్‌ ప్రారంభమవ్వగా అదే నెల 24న ముంబయిలోని ఓ స్టార్‌హోటల్‌లో ఆయన గుండెపోటుతో మృతిచెందారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ పునఃప్రారంభమైన వేళ ఆ రెండు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అతడికి నివాళులర్పించారు. D అనే ఆకారంలో నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వీడియోను పీఎస్‌ఎల్‌ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తున లైక్‌ చేశారు.

డీన్‌‌ 1984 నుంచి 1992 వరకు 8 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. మొత్తం 52 టెస్టులు, 164 వన్డేలాడాడు. టెస్టుల్లో 46.55 సగటుతో 3,631 పరుగులు చేయగా, వన్డేల్లో 44.61 సగటుతో 6,068 పరుగులు సాధించారు.

ఇదీ చూడండి:డీన్ జోన్స్.. ఓ క్రికెట్ ప్రొఫెసర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.