ETV Bharat / sports

పాక్ క్రికెటర్లకు రెండుసార్లు కరోనా పరీక్షలు!

జూన్ 28న ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లబోయే పాక్​ క్రికెటర్లకు.. రెండుసార్లు కరోనా టెస్టులు చేయనున్నారు.​ వీటిలో ఎవరైనా పాజిటివ్​గా తేలితే, వారిని అక్కడే నిలుపుదల చేస్తారు.

పాకిస్థాన్ క్రికెటర్లకు రెండుసార్లు కరోనా పరీక్షలు!
పాకిస్థాన్ క్రికెటర్లు
author img

By

Published : Jun 19, 2020, 7:20 PM IST

త్వరలో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు చేయనున్నారు. కేవలం మూడు రోజుల్లోనే రెండుసార్లు టెస్టులు జరపనున్నారు. వచ్చే సోమవారం మొదటిది కాగా, బుధవారం మరోసారి పరీక్షించనున్నారు.

ఇందులో భాగంగా లాహోర్​లో, క్రికెటర్లతో పాటు ఇతర సభ్యులకు పరీక్షలు జరుపుతారు. అయితే రెండోసారి చేసిన టెస్టుల్లో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్​గా తేలితే వారు పర్యటనకు వెళ్లడం వీలుపడదని పీసీబీ అధికారి ఒకరు చెప్పారు.

అందుకే ఇంగ్లాండ్ టూర్​కు 29 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది పాక్ క్రికెట్ బోర్డు. దీనితో పాటే ఆటగాళ్లు తమ కుటుంబాలను తీసుకెళ్లేందుకు అనుమతించట్లేదని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.