ETV Bharat / sports

పాకిస్థాన్​ టెస్టు కెప్టెన్​గా బాబర్​ అజామ్​

పాకిస్థాన్​ క్రికెట్​ వైట్​ బాల్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్న బాబర్​ అజామ్​కు కీలక పగ్గాలు అప్పగించింది పీసీబీ. టెస్టు కెప్టెన్​గా అజహర్​ అలీ స్థానంలో బాబర్​ను ఎంపిక చేసినట్లు పీసీబీ ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి మంగళవారం ప్రకటించాడు.

Pakistan name Babar Azam as Test skipper
పాకిస్థాన్​ టెస్టు కెప్టెన్​గా ఎంపికైన బాబర్​ ఆజామ్​
author img

By

Published : Nov 11, 2020, 6:15 AM IST

పాకిస్థాన్​ క్రికెట్​ టెస్టు కెప్టెన్​గా అజహర్​ అలీ స్థానంలో బాబర్​ అజామ్​ను పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఎంపిక చేసింది. ఇప్పటికే వన్డే, టీ20 జట్లకు నాయకుడిగా వ్యవహరిస్తున్న బాబర్​ అజామ్​కు తాజాగా టెస్టు పగ్గాలను అప్పగించారు.

"బాబర్​ అజామ్​ చిన్న వయసులోనే భవిష్యత్​ తరానికి నాయకుడిగా ఎదిగాడు. ఆటలో అతడి ప్రదర్శన, పురోగతి కారణంగా గతేడాది వైట్​ బాల్​ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. అజామ్​ తన స్థిరమైన పనితీరు, నాయకత్వ నైపుణ్యాలతో కొత్త బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. భవిష్యత్​ గురించి ఆలోచిస్తున్న క్రమంలో బాబర్​ను కెప్టెన్​గా నియమించడం మంచిదని నిర్ణయించాం. తద్వారా ప్రతి మ్యాచ్​లోనూ అతడు బలోపేతం అవుతాడు".

- ఎహ్సాన్​ మణి, పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు ఛైర్మన్​

మంగళవారం సాయంత్రం అజార్​ అలీతో పీసీబీ ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి సమావేశమైన తర్వాత ఈ నియామకాన్ని ధ్రువీకరించారు. ఇటీవలే ఇంగ్లాండ్​లో జరిగిన మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 1-0 తేడాతో పాక్​ ఓడిపోయింది.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా న్యూజిలాండ్​తో జరగనున్న సిరీస్​కు కెప్టెన్​గా బాబర్​ అజామ్​ వ్యవహరించనున్నాడు. మౌంట్​ మౌంగనుయ్​ వేదికగా డిసెంబరు 26-30న తొలి టెస్టు, క్రైస్ట్​చర్చ్​లో జనవరి 3-7 వరకు రెండో టెస్టు జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.