ప్రపంచకప్‌లో ఆడబోయే పాకిస్థాన్ జట్టు తెలిసింది. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న పేసర్ మహ్మద్ ఆమిర్‌ను పక్కన పెట్టింది సెలక్షన్ కమిటీ. కానీ ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు మాత్రం అతడిని ఎంపికచేసింది. ఇందులో ప్రదర్శనను బట్టి.. ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా ఉంచేది నిర్ణయిస్తామని తెలిపాడు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్.
ఇంగ్లండ్‌లో భారత్‌తో జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఆమిర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆడిన గత 14 వన్డేల్లో 9 మ్యాచ్‌ల్లో వికెట్లేమీ తీయలేదీ స్వింగ్ బౌలర్.
ఆస్ట్రేలియా సిరీస్‌లో సత్తాచాటిన యువ ఓపెనర్ అబిద్ అలీకి చోటు లభించింది. అందరూ ఊహించిన విధంగానే యువ బౌలింగ్ ద్వయం మొహమ్మద్ హస్నేన్, షాహీన్ అఫ్రిదీలకు మెగాటోర్నీకి అవకాశం దక్కింది.
-
Not many common names between Pakistan's 2015 and 2019 World Cup squads https://t.co/sRJyPhvME7 #CWC19 pic.twitter.com/KoW9xpaYyn
— ESPNcricinfo (@ESPNcricinfo) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Not many common names between Pakistan's 2015 and 2019 World Cup squads https://t.co/sRJyPhvME7 #CWC19 pic.twitter.com/KoW9xpaYyn
— ESPNcricinfo (@ESPNcricinfo) April 18, 2019Not many common names between Pakistan's 2015 and 2019 World Cup squads https://t.co/sRJyPhvME7 #CWC19 pic.twitter.com/KoW9xpaYyn
— ESPNcricinfo (@ESPNcricinfo) April 18, 2019
వీరితో పాటు రెండు ప్రపంచకప్‌ల్లో అనుభవం ఉన్న హఫీజ్, షోయబ్ మాలిక్‌లు జట్టుకు అదనపు బలం కానున్నారు. 10 వారాలుగా ఆటకు దూరంగా ఉన్న హఫీజ్ తుది జట్టులో ఉండటం మంచిదని యాజమాన్యం భావిస్తోంది.
జట్టు
సర్ఫ్రాజ్ అహ్మద్ (కెప్టెన్), అబిద్ అలీ, బాబర్ ఆజామ్, ఫహీం అష్రఫ్, ఫఖార్ జమాన్, హారిస్ సోహైల్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఇమామ్ ఉల్ హక్, జునైద్ ఖాన్, హఫీజ్, మొహమ్మద్ హస్నేన్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిదీ, షోయబ్ మాలిక్.