ETV Bharat / sports

భారత్​తో క్రికెట్​ గురించి మాట్లాడం: పాక్​ బోర్డు

భారత్​-పాకిస్థాన్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు అంటే ఆ రసవత్తరమే వేరు. క్రికెట్​ ప్రేక్షకులకూ ఫుల్​ మజా ఉంటుంది. అయితే అలాంటి పోరు జరిగి చాలా ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇందుకు కారణం ఇరుదేశాల​ మధ్య సత్సంబంధాలు క్షీణించడమే. తాజాగా ఈ అంశంపై మాట్లాడిన పీసీబీ ఛైర్మన్​ ఎహ్​సన్​ మణి.. ఇకపై క్రికెట్​ విషయంలో భారత్​తో సంప్రదింపులు జరగవని అన్నారు.

india vs pakistan match news
అప్పటివరకు భారత్​తో క్రికెట్​ గురించి మాట్లాడం: పాక్​ బోర్డు
author img

By

Published : Sep 15, 2020, 9:57 AM IST

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ పునరుద్ధరణ కోసం బీసీసీఐ స్పందించే వరకు తాము చర్చలు జరపబోమని పేర్కొన్నారు పీసీబీ ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణి. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం తామెంతగానో కృషి చేశామని, అయితే.. భారత క్రికెట్‌ బోర్డు నుంచి సరైన స్పందన రాలేదని చెప్పారు. తాజాగా ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. ఇరు దేశాల మధ్య క్రికెట్‌ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

india vs pakistan cricket news
పీసీబీ ఛైర్మన్​ ఎహ్‌సన్‌ మణి

"భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య దౌత్య, రాజకీయ సంబంధాలు బలపడే వరకు మేం క్రికెట్‌ వ్యవహారాల గురించి మాట్లాడం. ఇరు జట్ల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడానికి మేం ఎన్నో ఏళ్లుగా బీసీసీఐతో చర్చలు జరిపాం. ఇప్పుడిక భారత్‌తో టీ20 క్రికెట్‌ ఆడాలనే ఉద్దేశం మాకు లేదు. తొలుత రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తొలగిపోవాలి. పరిస్థితులన్నీ చక్కబడాలి. అప్పుడే మేం ఏదైనా మాట్లాడతాం"

-- ఎహ్‌సన్‌ మణి, పీసీబీ ఛైర్మన్​

"రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఇకపై బీసీసీఐతో సంప్రదించను. వాళ్లేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వమూ క్రికెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలే బీసీసీఐతో మాట్లాడుతుందని అనుకుంటున్నా. 1990ల కాలంలో రెండు బోర్డుల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అప్పుడు నేను పీసీబీ ప్రతినిధిగా ఉన్నప్పుడు.. బీసీసీఐ, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌లు అయిన జగ్‌మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్‌, మాధవరావు సింథియాలతో బాగా మాట్లాడేవాడిని. వారితో మంచి అనుబంధం నెలకొంది. కానీ గత 12 ఏళ్లుగా ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు బోర్డుల మధ్య ఉండాల్సిన రీతిలో పరిస్థితులు లేవు. బీసీసీఐ, పీసీబీ రెండూ నమ్మకం, స్వేచ్ఛగా మాట్లాడుకునేలా ఉండాలి. 2018లో నేను పీసీబీ ఛైర్మన్‌గా తిరిగి బాధ్యతలు తీసుకున్నాక ఇప్పుడున్న పరిస్థితులు చూసి నిరాశ చెందాను. అవన్నీ నన్ను షాక్‌కు గురిచేశాయి. తర్వాత రెండు జట్ల మధ్య క్రికెట్‌ బలోపేతం కోసం నేనెంతగానో ప్రయత్నించా. కానీ బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు" అని మణి అన్నారు.

2013 జనవరిలో పాక్‌ జట్టు భారత్‌లో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. కేవలం ఐసీసీ, లేదా ఆసియా కప్‌ల సందర్భంగానే తలపడుతున్నాయి. ఇక 2007-2008 సీజన్‌లో ఇరు జట్లు చివరి సారి టెస్టు సిరీస్‌ ఆడాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.