బుధవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలిచింది పాకిస్థాన్. కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత 297 పరుగులు చేసింది లంక. అనంతరం 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది పాక్. 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. వర్షం కారణంగా తొలివన్డే రద్దయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టులో ఓపెనర్ గుణతిలక(133), శనక(43) మినహా మరెవరూ రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో ఆమిర్ 3, షిన్వారీ, వాహబ్ రియాజ్, షాదాబ్‌ఖాన్, నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ఫకర్ జమాన్(76), అబిద్ అలీ(74), హరీశ్ సొహైల్(56) మెరుపులతో లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. లంక బౌలర్లలో ప్రదీప్ 2, లాహిర్ కుమార, హసరంగ, షెహన్ జయసూర్య తలో వికెట్ తీశారు.
ఇది చదవండి: మాస్టర్ బ్లాస్టర్‌కు స్వచ్ఛతా పురస్కారం