ETV Bharat / sports

'ఆసీస్​​ అనుభవాన్ని ఇంగ్లాండ్​పై చూపిస్తా'​

author img

By

Published : Jan 30, 2021, 7:09 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన భారత పేసర్​ మహ్మద్​ సిరాజ్​.. ఇంగ్లాండ్​లోనూ అదే ఒరవడి కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తానన్న నమ్మకం ఉందని తెలిపాడు.

pacer Siraj has expressed confidence that he will continue to perform better with the ball against England.
ఇంగ్లాండ్​పైనా మెరుగైన ప్రదర్శన చేస్తా: సిరాజ్​

ఆస్ట్రేలియా పర్యటనలో గొప్పగా రాణించి అందరి ప్రశంసలు అందుకున్న హైదరాబాదీ పేసర్​ మహ్మద్​ సిరాజ్​ ఇప్పుడు ఇంగ్లాండ్​తో సిరీస్​కూ ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నాడు. బంతితో మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

"దేశం తరఫున బాగా ఆడాలనుకుంటున్నా. ఆస్ట్రేలియాలో లాగే ఇంగ్లాండ్​పైనా సిరీస్​ గెలుపులో జట్టుకు సహాయపడాలనుకుంటున్నా. ఆస్ట్రేలియాతో సిరీస్​ నాకో గొప్ప అవకాశం. ఇంగ్లాండ్​ పైనా మెరుగైన ప్రదర్శన కొనసాగించగలనన్న నమ్మకం నాకుంది" అని చెప్పాడు.

"ఆస్ట్రేలియాతో సిరీస్​లో పుజారా, రహానె, షమి, రోహిత్​, కోచ్​ రవిశాస్త్రిల నుంచి చాలా నేర్చుకున్నా. ఆ పరిజ్ఞానాన్ని ఇప్పుడు ఇంగ్లాండ్​పై ఉపయోగించుకోవాలనుకుంటున్నా" అని సిరాజ్​ అన్నాడు. ఆసీస్​తో టెస్టు సిరీస్​లో 13 వికెట్లతో భారత్​ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్​గా సిరాజ్​ నిలిచిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: పంతా?.. సాహానా?- భారత్​ చూపు ఎవరి వైపు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.