ETV Bharat / sports

చెన్నై సూపర్​కింగ్స్ ప్రధాన లోపం అదే: ఆకాశ్ చోప్రా - cricket news

సీఎస్కే ప్రధాన బ్యాట్స్​మన్ రైనా విఫలమైతే.. జట్టు విజయావకాశాలు దెబ్బతింటాయని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. దీనితో పాటే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Aakash Chopra predicts MS Dhoni-led CSK's future in IPL 2021
ధోనీ
author img

By

Published : Mar 31, 2021, 11:00 AM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నారు. ఆ జట్టు టాప్‌-7లో నలుగురికి సరైన సన్నద్ధత లేదని పేర్కొన్నారు. ఇది ఆ జట్టు ప్రధాన లోపం అన్నారు. కీలకమైన సురేశ్‌ రైనా విఫలమైతే వారి విజయావకాశాలు మరింత దెబ్బతింటాయని చెప్పారు. మరో 9 రోజుల్లో సరికొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 10న దిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తొలి మ్యాచులో తలపడనుంది.

suresh raina
సురేశ్ రైనా

'సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ వంటి క్రికెటర్లు అంతర్జాతీయ లేదా పోటీ క్రికెట్‌ ఆడటం లేదు. గాయం కారణంగా కొన్నాళ్లుగా రవీంద్ర జడేజా టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. అంటే ఏడుగురు అత్యుత్తమ ఆటగాళ్లలో నలుగురు ఫామ్‌లో లేరు లేదా పోటీ క్రికెట్‌ ఆడలేదు' అని ఆకాశ్‌ గుర్తు చేశారు.

'రాబిన్‌ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌ రాణించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు దేశవాళీ క్రికెట్‌ ఆడారు. మంచి గణాంకాలు సాధించారు. డుప్లెసిస్‌ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. కానీ మిగిలిన నలుగురి సంగతేంటి? భారీ షాట్లు ఆడటం, పరుగెత్తడం వారికి సవాల్‌గా మారతాయి' అని ఆకాశ్‌ పేర్కొన్నారు.

'బ్యాటింగ్‌ ఆర్డర్లో రవీంద్ర జడేజాను ముందు పంపించాలని సీఎస్‌కేకు నా సూచన. ఎంఎస్‌ ధోనీ కూడా అంతే. ఏదేమైనప్పటికీ రైనా కీలకమవుతాడు. అతడు ఫామ్‌లో ఉండి పరుగులు చేస్తే జట్టుకు మేలు. లేదంటే కష్టమే. సీజన్‌ మొత్తం ఇబ్బంది పడుతుంది' అని చోప్రా వెల్లడించారు.

ఇది చదవండి: చెన్నై సూపర్​కింగ్స్.. ఈసారి చితక్కొడుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.