న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్ సమయంలో కుడిచేతి బొటనవేలికి గాయం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది పీసీబీ. కివీస్‌తో డిసెంబర్ 18 నుంచి టీ20 సిరీస్ జరగనుంది.
ప్రస్తుతం బాబర్ గాయాన్ని డాక్టర్లు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది పీసీబీ. డిసెంబర్ 26న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో అతడు పాల్గొనే అవకాశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. బాబర్ గైర్హాజరుతో షాదాబ్ ఖాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
పాకిస్థాన్ జట్టు
షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫిక్, ఫహీమ్ అష్రఫ్, హైదర్ అలీ, హరీస్ రౌఫ్, హుస్సేన్ తలత్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వాసీం, ఖుష్దిల్ షా, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నేన్, మహ్మద్ రిజ్వాన్, ముసా ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్, షాహీన్ షా అఫ్రిదీ, ఉస్మాన్ ఖాదిర్, వాహబ్ రియాజ్