హామిల్టన్ వేదికగా జరిగిన భారత్‌తో జరిగిన తొలి వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (103) సెంచరీతో రాణించాడు. రాహుల్ (88*), విరాట్ కోహ్లీ (51) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ దూకుడుగా ఆటను ప్రారంభించింది.
ఓపెనర్ నికోలస్ (78) అర్ధశతకం చేశాడు. గప్తిల్ (32), నికోలస్ ఔటైన తర్వాత టేలర్, లాథమ్ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ షాట్ ఆడబోయి లాథమ్ (69) పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో టేలర్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ చివర్లో నీషమ్ (9), గ్రాండ్‌హోమ్ (1) వికెట్లు పడటంతో కాస్త ఉత్కంఠరేగింది. కానీ టేలర్ (109*), సాంట్నర్ (12*) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఫలితంగా కివీస్ 48.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
-
Birthday boy Mitchell Santner holds his nerve to win it for New Zealand!
— ICC (@ICC) February 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The hosts chase down 348 for a four-wicket win and 1-0 lead in the series. #NZvIND pic.twitter.com/xaQlgeAw9x
">Birthday boy Mitchell Santner holds his nerve to win it for New Zealand!
— ICC (@ICC) February 5, 2020
The hosts chase down 348 for a four-wicket win and 1-0 lead in the series. #NZvIND pic.twitter.com/xaQlgeAw9xBirthday boy Mitchell Santner holds his nerve to win it for New Zealand!
— ICC (@ICC) February 5, 2020
The hosts chase down 348 for a four-wicket win and 1-0 lead in the series. #NZvIND pic.twitter.com/xaQlgeAw9x
భారత్ జోరు
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో భారత జట్టు పరుగుల వరద పారించింది. బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ శతకంతో రాణించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అర్ధశతకాలు చేశారు. టీ20ల్లో అదరగొట్టిన అయ్యర్.. అదే ఊపును వన్డేల్లోనూ కొనసాగించాడు. 107 బంతుల్లో 103 పరుగుల చేసి.. కెరీర్లో తొలిసారి వన్డే శతకం నమోదు చేసుకున్నాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. అయితే సెంచరీ తర్వాత జోరు పెంచే క్రమంలో సౌథీ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కోహ్లీ, రాహుల్ అర్ధశతకాలు
టాస్ ఓడిన భారత బ్యాటింగ్‌లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 32(31 బంతుల్లో; 6 ఫోర్లు), పృథ్వీ షా 20(21 బంతుల్లో; 3 ఫోర్లు) శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధాటిగా ఆడిన వీరిద్దరూ 4 పరుగుల వ్యవధిలోనే ఔటయ్యారు. గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో పృథ్వీ ఔటవ్వగా... మయాంక్ సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి కోహ్లీ, శ్రేయస్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. విరాట్ కెరీర్లో మరో అర్ధశతకం ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.
సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్(88) మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో 88 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఆఖర్లో కేదార్ జాదవ్(26*) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత జట్టు 347 రన్స్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2 వికెట్లు, గ్రాండ్‌హోమ్, సోధీ తలో వికెట్ సాధించారు.