కివీస్-ఆసీస్ మధ్య జరగాల్సిన ఐదో టీ20 విషయంలో మరో మార్పు జరిగింది. "మొదట అనుకున్నట్లు కాకుండా.. వెల్లింగ్టన్లోని స్కై స్టేడియంలో తొలుత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతుంది. తదుపరి న్యూజిలాండ్-ఇంగ్లాండ్(వైట్ ఫెర్న్స్) మహిళ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ నిర్వహిస్తాం" అని కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఆసీస్ క్రికెట్ బోర్డుతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కివీస్ బోర్డు పేర్కొంది. 'మ్యాచ్ ముగిసిన వెంటనే ఛార్టర్డ్ ఫ్లైట్లో ఆస్ట్రేలియా టీమ్ స్వదేశానికి పయనమవుతుంది. ఆక్లాండ్ గుండా ప్రయాణించే సమస్య ఉండదు. ఐదో టీ20 నాటికి వెల్లింగ్టన్లో కొవిడ్ తీవ్రత తగ్గితే ప్రేక్షకులను అనుమతిస్తాం' అని తెలిపింది.
ఇదీ చదవండి: కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న రవిశాస్త్రి