"పోరాటాన్ని ఆపొద్దు (నెవర్ గివప్)" అనే వాక్యం న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్‌కు బాగా సరిపోతుందోమో! ఎందుకంటే తన కాలికి గాయమైనా సరే పాక్‌తో జరుగుతున్న టెస్టులో బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు.
తొలి టెస్టులో రెండో రోజు, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేసిన బంతి.. వాగ్నర్ కుడికాలి చిటికిన వేలికి తగిలి వాపు వచ్చింది. ఎక్స్‌రేలో వేలు విరిగినట్లు తెలిసింది. అయినా సరే ఆ నొప్పిని భరిస్తూనే ఆ తర్వాత బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు సాధించాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్థాన్ 239 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా పాక్‌పై కివీస్ 192 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
ఇదీ చూడండి: ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డులు: కోహ్లీకి రెండు.. ధోనీకి ఒకటి