ETV Bharat / sports

'వెనుక ఉండి కోహ్లీకి సహకరించడమే నా బాధ్యత'

సారథి కోహ్లీకి వెనుక నుంచి సహాయపడటమే తన బాధ్యత అని అన్నాడు టీమ్ఇండియా వైస్ కెప్టెన్​ అజింక్యా రహానె. ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్​లో స్థానం దక్కించుకునే విషయమై ప్రస్తుతం తాము అతిగా ఆలోచించట్లేదని చెప్పాడు. తమ లక్ష్యం ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరగబోయే తొలి టెస్టు మాత్రమే అని వెల్లడించాడు.

rahaney
రహానె
author img

By

Published : Feb 4, 2021, 5:31 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో సారథిగా అదరగొట్టాడు అజింక్య రహానె. నాయకుడిగా జట్టును నడిపించి చారిత్రక విజయం అందించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌ సిరీస్​లో విరాట్‌ వెనుకే ఉండేందుకు అతడు మొగ్గు చూపుతున్నాడు. హోరాహోరీగా జరగబోయే టోర్నీలో సారథికి అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 5న ఇంగ్లిష్ జట్టుతో తొలి టెస్టులో టీమ్‌ఇండియా తలపడుతుంది.

"విరాట్​కు వెనుక నుంచి అండగా నిలవడమే నా బాధ్యత. కెప్టెన్​ మెదడులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వాటిని అంచనా వేసి అందులో ఏమైనా మార్పులు అవసరమా లేదంటే సూచనలు ఇవ్వడమా అనేది వైస్​కెప్టెన్​ బాధ్యత. కాబట్టి నా పని చాలా తేలికగా ఉంటుంది. నేనెప్పుడు వైస్​కెప్టెన్​గా అతడి వెనుక ఉండాలనే అనుకుంటాను. కోహ్లీ ఏదైనా అడిగితే చెబుతాను." అని రహానె అన్నాడు.

ఆస్ట్రేలియాపై విజయం ప్రత్యేకమైనదని చెప్పిన రహానె.. అది గతం అని అన్నాడు. తమ దృష్టంతా ఇంగ్లాండ్​తో జరగబోయే తొలి టెస్టుపై ఉందని అన్నాడు. "ఇకపై ఇంగ్లాండ్‌తో టెస్టుసిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడతాం. ఒక్కో మ్యాచును లక్ష్యం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ప్రస్తుతం టీమ్​ఇండియా లక్ష్యం చెన్నై‌లో ఆడే తొలి టెస్టు మాత్రమే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఇంకా 3-4 నెలల సమయం ఉంది. గత కొంతకాలంగా టెస్టుల్లో న్యూజిలాండ్ చాలా బాగా ఆడుతోంది. ఫైనల్‌కు చేరేందుకు ఆ జట్టుకు పూర్తి అర్హత ఉంది. మేము ఈ టెస్టు ఛాంపియన్​షిప్​ గురించి అతిగా ఆలోచించడం లేదు." అని రహానె వెల్లడించాడు.

చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండొచ్చని రహానె అంటున్నాడు. "గురువారం సాధన ముగిశాక తుది జట్టు కూర్పుపై నిర్ణయం తీసుకుంటాం. భారత పిచ్‌లు చాలావరకు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. మా బలం వైపే మేం మొగ్గు చూపిస్తాం. ఏం జరుగుతుందో చూడండి' అని పేర్కొన్నాడు.

ప్రస్తుతం భారత్​ పర్యటనలో భాగంగా చెన్నైలో ఉంది ఇంగ్లాండ్​. ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, మూడు(డేనైట్), నాలుగో మ్యాచ్​కు అహ్మదాబాద్ (మొతేరా స్టేడియం) వేదిక కానుంది.

ఇదీ చూడండి: రహానె ప్రశాంతతకు అసలు కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.