ETV Bharat / sports

'పిచ్​ ఏమో కానీ.. వై-ఫై మాత్రం సరిగా లేదు'

మొతేరా పిచ్​పై ఫన్నీగా స్పందించాడు ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్​. పిచ్​ సంగతేమో కానీ గ్రౌండ్​లో వై-ఫై మాత్రం సరిగా రావట్లేదని సరదాగా వ్యాఖ్యానించాడు.

Not much to complain in life, apart from bad Wi-Fi: Jofra Archer gives hilarious take on Motera pitch debate
'పిచ్​ ఏమో కానీ.. వై-ఫై సమస్య మాత్రం ఉంది'
author img

By

Published : Mar 2, 2021, 11:26 AM IST

Updated : Mar 2, 2021, 12:41 PM IST

మొతేరా పిచ్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొందరు క్రికెట్ మాజీలు సదరు పిచ్ టెస్టు మ్యాచ్​లకు పనికి రాదంటూ విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ఆ విషయంపై పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. తాజాగా మరో ఇంగ్లాండ్​ ఆటగాడు జోఫ్రా ఆర్చర్​ మాత్రం సరదాగా స్పందించాడు.

"ఏ పిచ్​​పై ఆడుతున్నామన్నది అసలు పట్టించుకోను. డై/నైట్​ టెస్టు గురించి పెద్దగా ఫిర్యాదు చేయాల్సిన విషయమేమీ లేదు. నా వరకైతే ఉన్న సమస్య మాత్రం గ్రౌండ్​లో వై-ఫై సరిగా రావట్లేదు. కౌంటీల్లో నేను తొలిసారి ససెక్స్​ జట్టుకు ఆడాను. ఈ మ్యాచ్​లో లీసెస్టర్ షైర్​ను ఓడించాం. ఈ మ్యాచ్​ రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లాండ్​లోనూ మ్యాచ్​లు త్వరగానే ముగిశాయనేది గుర్తుంచుకోవాలి."

-జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ క్రికెటర్​.

'నిజాయితీగా చెప్తున్నా. మేము ఉన్నది భారత్​లో. ఇక్కడి పిచ్​లు స్పిన్​కు సహకరిస్తాయని తెలుసు. అంటే ఇక్కడ బ్యాటింగ్ చేయడం కష్టమనే కదా అర్థం" అని ఆర్చర్​ అభిప్రాయపడ్డాడు.

రూట్​ మాలో స్ఫూర్తి నింపాడు..

మూడో టెస్టు సందర్భంగా తమ జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ.. కెప్టెన్ జో రూట్​ తమలో స్ఫూర్తిని నింపాడని ఆర్చర్​ పేర్కొన్నాడు. "డే/నైట్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అశ్విన్, అక్షర్​ను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఇది గమనించిన మా సారథి రెండో ఇన్నింగ్స్​కు ముందు మాతో మాట్లాడాడు. నిర్భయంగా ఆడాలని సూచించాడు. మనమేమీ ఓడిపోమని మాలో ధైర్యం నింపాడు. మిగిలిన మ్యాచ్​లకు కూడా ఇదే ధోరణితో ఉండాలని చెప్పాడు" అని తమ నాయకుడి గురించి చెప్పుకొచ్చాడు ఆర్చర్​.

ఇదీ చదవండి: 'మ్యాన్​​ ఆఫ్ ది మ్యాచ్'కు పెట్రోల్​ బహుమతి​

Last Updated : Mar 2, 2021, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.